AP Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు సజీవ దహనం
AP Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఢీకొనడంతో.. భారీగా మంటలు చెలరేగి నలుగురు సజీవదహనం అయ్యారు.
Road accident in Andhra pradesh
- ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం
- పల్నాడు జిల్లాలో జాతీయ రహదారిపై ఘటన
- రెండు లారీలు ఢీకొని నలుగురు సజీవదహనం
AP Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఢీకొనడంతో.. భారీగా మంటలు చెలరేగి నలుగురు సజీవదహనం అయ్యారు. పల్నాడు జిల్లా బోయపాలెం వద్ద జాతీయ రహదారిపై ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
Also Read : Nara Lokesh : APL ఫైనల్ మ్యాచ్.. మంగళగిరి స్టేడియంలో సందడి చేసిన నారా లోకేష్..
పల్నాడు జిల్లాలోని ఎన్హెచ్-16 జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొనడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు సజీవదహనం అయ్యారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలకలూరిపేట నుంచి గుంటూరు వైపు వెళ్తున్న లారీ బోయపాలెం వద్ద రోడ్డుపై డీజిల్ అయిపోయి నిలిచిపోయిన మరో లారీని గమనించి దానిని తప్పించే ప్రయత్నం చేసింది. అయితే నిలిచిపోయిన లారీ వద్ద ఎలాంటి ప్రమాద హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేయకపోవడంతో, వేగంగా వస్తున్న లారీ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి ఎదురుగా ఉన్న రహదారిపైకి దూసుకెళ్లింది. అదే సమయంలో గుంటూరు నుంచి చిలకలూరిపేట వైపు వస్తున్న మరో లారీను ఢీకొనడంతో భారీ పేలుడు శబ్దంతో రెండు వాహనాల్లో మంటలు చెలరేగాయి. మంటలు క్షణాల్లోనే లారీలను పూర్తిగా చుట్టుముట్టాయి. ఈ ప్రమాదంలో మొత్తం నలుగురు మృతి చెందగా.. మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ ఘోర ప్రమాదం కారణంగా ఎన్హెచ్-16పై కొంతసేపు ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అనంతరం ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా వాహనాలను సర్వీస్ రోడ్డుమీదుగా మళ్లించారు.
