Kadapa : మద్యం మత్తులో జేసీబీ నడిపిన డ్రైవర్.. ముగ్గురు మృతి

కడప జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో కోసం వేచి ఉన్న కూలీలపైకి జేసీబీ దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి చెందారు.

Kadapa : మద్యం మత్తులో జేసీబీ నడిపిన డ్రైవర్.. ముగ్గురు మృతి

Kadapa

Updated On : October 21, 2021 / 6:16 PM IST

Kadapa : కడప జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో కోసం వేచి ఉన్న కూలీలపైకి జేసీబీ దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన మైదుకూరు – పోరుమామిళ్ల ప్రధాన రహదారిపై ముదిరెడ్డిపల్లె సమీపంలో జరిగింది. కూలిపనులు ముగించుకొని ఆటో కోసం వేచి చూస్తున్న సమయంలో వారిపైకి జేసీబీ దూసుకొచ్చింది.

చదవండి : Road Mishap : ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు.. 20 మందికి గాయాలు

ఈ ప్రమాదంలో శేషమ్మ, మహాలక్ష్మమ్మ, పుల్లమ్మ అక్కడికక్కడే మృతి చెందగా మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు కేసలింగాయపల్లె గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. జేసీబీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

చదవండి : Road Accident: ముందు ట్రాలీ.. వెనుక మినీ లారీ.. మధ్యలో నలిగిపోయిన కార్