సినీ ఫక్కీలో పట్టపగలే చోరీ : సైకిల్‌పై పెట్టిన డబ్బు సంచిని ఎత్తుకెళ్లిన దొంగలు

సినీ ఫక్కీలో పట్టపగలే చోరీ : సైకిల్‌పై పెట్టిన డబ్బు సంచిని ఎత్తుకెళ్లిన దొంగలు

Updated On : February 17, 2021 / 6:58 PM IST

Robbers steal Rs 35,000 in Guntur : గుంటూరు జిల్లాలో దోపిడి దొంగలు పట్టపగలే రెచ్చిపోయారు. నరసరావుపేట ఎస్బీఐ బ్రాంచ్‌ సమీంలో ఆంజనేయులు అనే రిటైర్డ్ స్కూల్ హెడ్ మాస్టర్ నుంచి రూ.35వేలను చోరీ చేశారు.

డబ్బులను తీసుకుని సైకిల్‌పై ఇంటికి వెళ్తున్న సమయంలో దోపిడి చేశారు. సినీ ఫక్కీలో నగదు కింద పడిందని చెప్పి ఆంజనేయులును ఏమార్చిన దొంగలు.. సైకిల్‌పై పెట్టిన డబ్బు సంచిని బైక్‌పై ఎత్తుకెళ్లారు.

దొంగలను పట్టుకునేందుకు స్థానికులు ప్రయత్నించినా లాభం లేకపోయింది. చోరీకి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యాయి. సీసీటీవీ ఆధారంగా దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

తన డబ్బులు కావని చెబుతున్నా.. దొంగలు తనను ఏమార్చి నగదు సంచిని పట్టుకెళ్లాలరని బాధితుడు ఆంజనేయులు తెలిపారు. కళ్ల ముందే సంచితో పారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.