రూ. 15 వేల వివాదం, బార్ కు పిలిచి పొడిచి చంపేశాడు

Rs. 15 thousand controversy : గుంటూరు జిల్లా తెనాలి నందుల పేటలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో షేక్ రఫీ.. సుభానిని కత్తితో పొడిచి హత్యకు పాల్పడ్డాడు. 15 వేల రూపాయల విషయంలో తలెత్తిన వివాదం హత్యకు దారితీసింది. నందులపేటకు చెందిన రఫీ వద్ద సుభాని గతంలో 15 వేల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు.
డబ్బులు తిరిగి ఇమ్మని అడగడంతో సుభాని.. రఫీతో ఘర్షణకు దిగి దుర్భాషలాడాడు. దీంతో కోపం పెంచుకున్న రఫీ… సుభానితో పాటు మరో ఇద్దరిని నమ్మకంగా బార్ అండ్ రెస్టారెంట్ కు తీసుకువెళ్లాడు. రాత్రి 11 గంటల సమయంలో రఫీ తన వెంట తెచ్చుకున్న కత్తితో సుభానిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు.
దీంతో పక్కనే ఉన్న ఇద్దరు స్నేహితులు అక్కడనుండి పరారయ్యారు. తీవ్ర గాయాలు కాడవంతో.. సుభాని కూర్చున్న చోటనే కుప్పకూలి మృతి చెందాడు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
విషయం తెలుసుకున్న టూ టౌన్ పోలీసులు స్పాట్‌కు చేరుకొని బార్ అండ్ రెస్టారెంట్ లో వివరాలు సేకరించారు. ఇటీవల చోటు చేసుకున్న వరుస హత్యలతో తెనాలి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గడిచిన కొద్ది కొద్దిరోజుల్లో తెనాలిలో ఆరు హత్యాయత్నాలు జరిగితే.. నలుగురు మృతి చెందారు.