డ్రైవర్ నిర్లక్ష్యం..పోయిన ప్రాణం : సైకిలిస్టుపై దూసుకెళ్లిన ఆర్టీసీ బస్ 

  • Published By: veegamteam ,Published On : October 30, 2019 / 07:50 AM IST
డ్రైవర్ నిర్లక్ష్యం..పోయిన ప్రాణం : సైకిలిస్టుపై దూసుకెళ్లిన ఆర్టీసీ బస్ 

Updated On : October 30, 2019 / 7:50 AM IST

ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. విజయనగరం జిల్లాలో సైకిలిస్ట్ పై ఆర్టీసీ బస్ దూసుకెళ్లింది. సైకిల్ పై వస్తున్న ఓ యువకుడు రోడ్డు మలుపు తిరుగుతున్నాడు. ఆ సమయంలో వస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ సైకిల్ పై వస్తున్న యుకుడిని గమనించలేదు. దీంతో అతనిపైకి బస్సు ఎక్కేసింది. ఈ ప్రమాదంలో అతను బస్ ముందు చక్రాల కింద పడి అక్కడిక్కడే చనిపోయాడు.

కళ్ల ముందే ఈ ప్రమాదం జరగటంతో ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యంపై స్థానికులు షాక్ కు గురయ్యారు. సైకిల్ పై వస్తున్న యువకుడు బస్ వస్తోందని గమనించి ఆగిపోయినా డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఓ నిండు ప్రాణం పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.