Durga Temple: ఇంద్రకీలాద్రిపై మూడు రోజుల పాటు శాకంబరీ ఉత్సవాలు
బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై జులై 22వ తేదీ నుంచి మూడు రోజుల పాటు శాకంబరీ ఉత్సవాలు జరగనున్నట్లు నిర్వహకులు వెల్లడించారు. ఇందులో భాగంగానే అమ్మవారు మూడు రోజులపాటు కూరగాయల రూపంలో దర్శనమివ్వనున్నారు.

Durga Temple
Durga Temple: బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై జులై 22వ తేదీ నుంచి మూడు రోజుల పాటు శాకంబరీ ఉత్సవాలు జరగనున్నట్లు నిర్వహకులు వెల్లడించారు. ఇందులో భాగంగానే అమ్మవారు మూడు రోజులపాటు కూరగాయల రూపంలో దర్శనమివ్వనున్నారు. ఈ ఉత్సవాలను కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే విజయవంతం చేయాలని దుర్గగుడి పాలకమండలి, అధికారుల నిర్ణయించారు.
దీనికి సంబంధించిన కూరగాయలు, పండ్లను దాతలు, రైతులు, వ్యాపార వర్గాల నుంచి సేకరిస్తారు. జులై 18న తెలంగాణ రాష్ట్రం నుంచి దుర్గమ్మకు భాగ్యనగర్ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ బంగారు బోణం సమర్పించనుంది.