వైసీపీ నేత అంబటి రాంబాబుకు సత్తెనపల్లి పోలీసుల నోటీసులు

మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు సత్తెనపల్లి రూరల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.

వైసీపీ నేత అంబటి రాంబాబుకు సత్తెనపల్లి పోలీసుల నోటీసులు

YCP Leader Ambati Rambabu

Updated On : July 20, 2025 / 12:32 PM IST

YCP Leader Ambati Rambabu: మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు సత్తెనపల్లి రూరల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. గుంటూరులోని అంబటి రాంబాబు ఆఫీస్‌కి వచ్చి నోటీసులు ఇచ్చారు. జులై 21వ తేదీన విచారణకు హాజరు కావాలని సూచించారు.

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గత నెల 18న పల్నాడు జిల్లా రెంటపాళ్లలో పర్యటించారు. ఆ సమయంలో అంబటి రాంబాబు నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనపై గుంటూరు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా.. సత్తెనపల్లి రూరల్ పోలీసులు అంబటిపై కేసు నమోదు చేశారు.