Teacher Misbehave : తాకరాని చోట తాకే వాడు, ఫోన్ జేబులో పెట్టాలని చెప్పేవాడు.. కాకినాడ జిల్లాలో కీచక టీచర్
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం జి. మేడిపాడులో ఓ టీచర్.. విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ లో 7వ తరగతి చదువుతున్న విద్యార్థులపై రమణ అనే సోషల్ టీచర్ కొంతకాలంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు.

Teacher Misbehave : పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి వారు సన్మార్గంలో వెళ్లేలా చూడాల్సిన గురువులే దారి తప్పుతున్నారు. తమ వికృత చేష్టలతో పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికి కళంకం తెస్తున్నారు. కామంతో మృగంలా ప్రవర్తిస్తున్నారు. క్లాస్ రూమ్ లో పాఠాలు బోధించాల్సింది పోయి పిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు.
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం జి. మేడపాడులో ఓ టీచర్.. విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ లో 7వ తరగతి చదువుతున్న విద్యార్థులపై రమణ అనే సోషల్ టీచర్ కొంతకాలంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. కీచక టీచర్ పై గతంలో విద్యార్థులు హెడ్ మాస్టర్ కి ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ హెడ్ మాస్టర్ పట్టించుకోలేదు.
Also Read..Anti Rape Footwear : ‘అత్యాచారం నిరోధక పాదరక్షలు’ తయారు చేసిన విద్యార్థిని ..
దీంతో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పెద్దాపురం వైసీపీ కో-ఆర్డినేటర్ దొరబాబుకి విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఆయన విద్యాశాఖ అధికారులు, పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో విద్యాశాఖ అధికారులు, పోలీసులు రంగంలోకి దిగారు. స్కూల్ కి వెళ్లి విచారణ చేపట్టారు. విద్యార్థుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. కీచక టీచర్ ను కఠినంగా శిక్షించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
ఏజెన్సీలో కాకవాడ గిరిజన బాలికల ఘటన మరువక ముందే మరో దారుణం వెలుగు చూసింది. సామర్లకోట్ల మండలం జి. మేడపాడు జెడ్పీ హైస్కూల్ లో 7వ తరగతి విద్యార్థులతో సోషల్ టీచర్ రమణ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థులు వాపోయారు. ఫోన్ తీసుకుని జేబులో పెట్టాలని చెప్పడం, చాక్ పీస్ ఇచ్చే నెపంతో చేతులు టచ్ చేయడం, ఎక్కడ పడితే అక్కడ తాకడం వంటివి చేసేవాడని విద్యార్థులు ఆరోపించారు.
అంతేకాదు బూతులు కూడా తిట్టేవాడని ఆవేదన వ్యక్తం చేశారు. టీచర్ వేధింపుల గురించి హెడ్ మాస్టర్ కి ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయిందని విద్యార్థులు చెప్పారు. ఆ టీచర్ పై చర్యలు తీసుకోవడం మాని.. ఆ టీచర్ కి దూరంగా ఉండాలని తమకే ఉచిత సలహాలు ఇచ్చేవాడన్నారు. తమ నడుము పట్టుకుని గిల్లే వాడని పిల్లలు వాపోయారు. ఇప్పటికైనా హెడ్ మాస్టర్ స్పందించి కీచక టీచర్ పై చర్యలు తీసుకోవాలని, కఠినంగా శిక్షించాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.