Cyclone Montha: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు.. ఎన్ని రోజులంటే?
వాయుగుండం క్రమంగా తుపానుగా బలపడుతోన్న నేపథ్యంలో నాలుగు రోజులపాటు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
Cyclone Montha: ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేసిన విషయం తెలిసిందే. వాయుగుండం క్రమంగా తుపానుగా బలపడుతోన్న నేపథ్యంలో నాలుగు రోజులపాటు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. మొంథా తుపాను కారణంగా ప్రాణనష్టం జరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.
ఈ నెల 27, 28, 29 తేదీల్లో కృష్ణా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఈ మేరకు కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశాలు జారీ చేశారు. సాంఘిక సంక్షేమ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులు ఆదివారం సాయంత్రంలోగా వారి ఇళ్లకు వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
బీసీ రిజర్వేషన్లపై క్యాబినెట్ భేటీలో ఏం తేల్చనున్నారు? జూబ్లీహిల్స్ బైపోల్‌కు ముందే..
అలాగే, తూర్పు గోదావరి, అన్నమయ్య, బాపట్ల, కడప జిల్లాల్లోనూ స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. బాపట్లలో ఈ నెల 27, 28, 29న బడులు తెరచుకోవు. కడపలో 27, 28న సెలవులు ఉంటాయి.
ఇక తూర్పు గోదావరి, అన్నమయ్య జిల్లాల్లో 27, 28న సెలవులు ప్రకటించారు. విద్యార్థులు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని అధికారులు సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లోని మరిన్ని జిల్లాల్లోనూ విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించే అవకాశం ఉంది.
