AP Omicron : ఏపీలో రెండో ఒమిక్రాన్ కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్‌లో రెండో ఒమిక్రాన్ కేసు నమోదైంది. కెన్యా నుంచి ఈ నెల 12న తిరుపతి వచ్చిన 39 ఏళ్ల మహిళకు వైద్యపరీక్షలు నిర్వహించగా కరోనా అని తెలిసింది.

AP Omicron : ఏపీలో రెండో ఒమిక్రాన్ కేసు నమోదు

Ap Omicron

Updated On : December 22, 2021 / 1:13 PM IST

AP Omicron : దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఇప్పటికే 200పైగా కేసులు నమోదయ్యాయి. అత్యధిక ఒమిక్రాన్ కేసులతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా.. రెండవ స్థానంలో ఢిల్లీ ఉంది. ఇక ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో రెండో ఒమిక్రాన్ కేసు నమోదైంది. కెన్యా నుంచి ఈ నెల 12న తిరుపతి వచ్చిన 39 ఏళ్ల మహిళకు వైద్యపరీక్షలు నిర్వహించగా కరోనా అని తెలిసింది. దీంతో శాంపిల్స్ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపారు అధికారులు.

చదవండి : Hiv in Omicron : ఒమిక్రాన్ మూలాల్లో HIV..ఆ దేశంలో ప్రతి ఐదుగురిలో ఒకరికి ఎయిడ్స్..

జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ రీపోర్ట్‌లో ఆమెకు ఒమిక్రాన్ వేరియంట్ అని తేలింది. దీంతో అధికారులు ఆమె కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించారు. వారికి కరోనా నెగటివ్ వచ్చినట్లు వైద్యశాఖ వర్గాలు వెల్లడించాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లో మొదటి కేసు విజయనగరం జిల్లాలో నమోదు కాగా, రెండవ కేసు తిరుపతి నగరంలో నమోదైంది.

చదవండి : Omicron tension in AP: ఒమిక్రాన్‌పై ఏపీ ప్రభుత్వం అప్రమత్తం