Simhadri Ramesh : తన కులం ఓట్లన్నీ చంద్రబాబుకు వేయించాలన్నదే పవన్ పన్నాగం, ఏపీతో నీకేం సంబంధం?- ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్

ఎవరు అధికారంలో ఉన్నా, ఎప్పుడూ హైదరాబాద్ లోనే ఉండే ఈ అజ్ఞాతవాసి, అజ్ఞానవాసి, అసలు ఏపీతో ఈయనకు ఉన్న సంబంధం ఏమిటో ముందు చెప్పాలి. Simhadri Ramesh Babu

Simhadri Ramesh : తన కులం ఓట్లన్నీ చంద్రబాబుకు వేయించాలన్నదే పవన్ పన్నాగం, ఏపీతో నీకేం సంబంధం?- ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్

Simhadri Ramesh Babu (Photo : Google)

Updated On : October 1, 2023 / 11:13 PM IST

Simhadri Ramesh Babu : జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఫైర్ అయ్యారు అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్. జగన్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే సింహ్రాది కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ తీరు చూస్తుంటు ముందు నుంచి ఆయనకు ఏమైనా పిచ్చి ఉందా? అనే అనుమానం కలుగుతోందన్నారు. స్కిల్ కేసులో చంద్రబాబు అవినీతి చేయలేదని చెప్పటానికి న్యాయస్థానాలే సిద్ధంగా లేనప్పుడు పవన్ కల్యాణ్ డైలాగులు ఎవరికి కావాలి..? అవి ఎవరిని సంతోషపెడతాయి..? అని ఆయన ప్రశ్నించారు.

”అవనిగడ్డలో పవన్ కల్యాణ్ ఇంతకూ ఏం చెప్పదలచుకున్నాడంటే.. అటు కేంద్ర ప్రభుత్వ ఐటీ శాఖ, కేంద్ర ప్రభుత్వ ఈడీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వ సీఐడీ.. ఈ మూడూ చంద్రబాబు ఎల్లో వైరస్ ను, వారి ల్యాబ్ టెస్టుల్లో నిర్ధారిస్తున్నా, ఆ వైరస్ అంటే తనకెంతో ప్రేమ అని, తాను ఆ వైరస్ కోసమే బతుకుతున్నానని పవన్ చెప్పారు. కనీసం భీమవరంలో గెలవలేని ఈ వీరుడు ముఖ్యమంత్రిని ఏకవచనంతో పిలిచి గొప్పవాడిని అయిపోయానని అనుకోవడం అంతకంటే పిచ్చి ఎక్కడైనా ఉంటుందా..? అసలు పవన్ కల్యాణ్ కి ముందు నుంచి పిచ్చి ఉందా?

Also Read..AP Politics: ఏపీలో రాజకీయ కురుక్షేత్రం.. నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలే నెక్ట్స్‌ టార్గెట్?

పవన్ కల్యాణ్ భ్రమల్లో ఉంటూ రెండో ప్రపంచ యుద్ధం అంటారు. హిట్లర్ అంటారు. యాక్సిస్ పవర్స్, ఎలైట్ పవర్స్ అంటారు. దానికీ, ఏపీ రాజకీయానికి ఏమిటి సంబంధం..? 2019లో తన ఓటమి, చంద్రబాబు ఓటమి.. ఈ రెండూ బహుశా పవన్ కల్యాణ్ ను పిచ్చివాడిని చేసినట్టు ఉన్నాయి. బెంగాల్ విభజన- లార్డ్ కర్జన్ అంటారు. అది 2007లో జరిగిందంటారు. 2007లో బెంగాల్ విభజన ఏమిటి- లార్డ్ కర్జన్ ఏమిటి..? ఈ చరిత్ర తెలియని వ్యక్తితో, 1905లో బెంగాల్ విభజన జరిగిందని తెలియని వ్యక్తితో ఇంత భారీ ప్రసంగాలు చేయించడమేమిటి..? మతిస్థిమితం లేని వారిని రోడ్ల మీద నిలబెట్టి అంతసేపు మాట్లాడించడం ఏమిటి..?. ఇంతకంటే దురదృష్టం తెలుగు ప్రజలకు ఉంటుందా..?

ఇక, ఎవరు అధికారంలో ఉన్నా, ఎప్పుడూ హైదరాబాద్ లోనే ఉండే ఈ అజ్ఞాతవాసి, అజ్ఞానవాసి, అసలు ఏపీతో ఈయనకు ఉన్న సంబంధం ఏమిటో ముందు చెప్పాలి. అసలు ఏపీ ఇతని రాష్ట్రం ఎలా అవుతుందో ముందుగా చెప్పాలి. మాది అవనిగడ్డ- మీది ఎర్రగడ్డ. తన కులం ఓట్లని చంద్రబాబుకు వేయించాలి అన్న పన్నాగం తప్ప, మరేదీ లేని ప్యాకేజీ స్టార్ ని, అసలు ఏపీలోకి ఎందుకు రానివ్వాలో వివరంగా చెప్పాలి.

Also Read..Gudivada Amarnath: అనకాపల్లినే అమర్‌నాథ్ మళ్లీ ఎంచుకోడానికి కారణమేంటి?

పొద్దున లేస్తే చాలు.. జగన్ ని చూసి అసూయతో దహించుకుపోయే ఈ మనిషికి రాజకీయాలు, ప్రజాసేవ అనే పదాలకు అర్థం కూడా తెలియదు. ఇక తనమీద ఎన్ని కేసులైనా పెట్టుకోమన్నారు. దత్తపుత్రుడికి ఎంత ప్యాకేజీ ఇచ్చారో, ఏదో ఒక రోజున బాబు, లోకేశ్ బయట పెడతారు. ఆరోజు తప్పకుండా ఆయన కోరిక నెరవేరుతుంది. కేసులేం కర్మ అంతకుమించిన శిక్షలు కూడా ఉంటాయి. బెదిరింపులు, అదిరింపులు పవన్ కల్యాణ్ మార్క్ రాజకీయాలు తప్ప, అసలు ప్రజాసేవలో ఉండటానికే ఆయన అర్హుడు కాదు” అని నిప్పులు చెరిగార ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్.