ఏపీ అసెంబ్లీ : రూ. 2 వేల 626 కోట్ల దోపిడి..అవినీతిని బయటపెడుతాం

ఇళ్ల నిర్మాణంలో రివర్స్ టెండరింగ్‌తో రూ. 106 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందని మంత్రి బోత్స సత్యనారాయణ వెల్లడించారు. టీడీపీ చేసిన దోపిడి వల్లే..రివర్స్ టెండరింగ్‌కు వెళ్లామని, అవసరమైతే టీడీపీ సభ్యులను కూడా పరిశీలనకు తీసుకెళుతామన్నారు. ఈ లెక్కన 3 లక్షల ఇళ్లకు రూ. 2 వేల 626 కోట్లు దోపిడి చేశారని, అవినీతిని సహించేది లేదు..బయటపెట్టి తీరుతామని స్పష్టం చేశారు.
ఒక్క పైసా లబ్దిదారుడి నుంచి తీసుకోవద్దని సీఎం జగన్ ఆదేశించారని, హౌసింగ్ రెండు టెండర్లలో రివర్స్ టెండరింగ్‌కు వెళితే..దాదాపు రూ. 150 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం సమకూరిందన్నారు. ఏపీ అసెంబ్లీ ఆరో రోజు 2019, డిసెంబర్ 16వ తేదీ సోమవారం ప్రారంభమయ్యాయి.
ఇళ్ల నిర్మాణంపై సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు చెప్పినవన్నీ అవాస్తవాలేనన్నారు. గత ప్రభుత్వం దోపిడి, అవినీతికి పాల్పడిందన్నారు. గత ప్రభుత్వం హడావుడిగా ఇళ్ల నిర్మాణం చేపట్టిందని, ఐదేళ్లలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు.
కేంద్రం, రాష్ట్రం చెరో రూ. లక్షన్నర సబ్సిడీ కింద ఇస్తాయన్నారు. మౌలిక సదుపాయాల కోసం రాష్ట్రం మరో రూ. 90 వేలు ఇస్తుందన్నారు. ఆధునిక పరిజ్ఞానంతో ఇళ్లు నిర్మించి లబ్దిదారులకు ఇళ్లు ఇవ్వాలనేది తమ లక్ష్యమన్నారు. లబ్దిదారులను తొలగించామన్నది వాస్తవం కాదన్నారు.
హౌసింగ్ కమిటీ వేయాలనడం కరెక్టు కాదన్నారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన ఆధారంగానే రివర్స్ టెండరింగ్‌కు వెళ్లినట్లు సభలో వెల్లడించారు. రూ. వేయి కోట్ల టెండరింగ్‌కు వెళితే..రూ. 150 కోట్లు ఆదాయయ్యాన్నారు. ఒక ఇంటికి రూ. 78 వేలు ఆదా అయ్యిందన్నారు.
అంతకుముందు..టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ…పేదల గృహ నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో లక్షలాది ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాయని, ప్రభుత్వ రంగులు వేస్తే పేదలకు ఇళ్లు కేటాయించవచ్చని, ఆరు నెలలైనా ప్రభుత్వం దానిపై దృష్టి పెట్టలేదన్నారు.
Read More : ధనుర్మాస ఘడియలు : తిరుమలలో సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై