Somu Veerraju: జనసేనపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు

ఏపీలో తమ మిత్రపక్షం జనసేనను ఉద్దేశించి సోమువీర్రాజు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల గురించి ఆయన మాట్లాడారు.

Somu Veerraju: జనసేనపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు

Somu Veerraju

Updated On : March 22, 2023 / 9:00 PM IST

Somu Veerraju: ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections) జనసేన నుంచి తమకు సరైన సహకారం అందలేదంటూ బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఇవాళ విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. “ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థులకు జనసేన నుంచి అందిన సహకారం ఎంత అనేది మీరే ఆలోచించుకోండి. ప్రధాని మోదీ బాగా పనిచేస్తారు. ఏపీలో బీజేపీ మాత్రం ఎదగకూడదని అందరూ మాట్లాడుతున్నారు” అని అన్నారు.

“ఈ వ్యాఖ్యలు ఏ ఒక్కరినో ఉద్దేశించినవి కాదు. బీజేపీ-జనసేన విడిపోవాలనేది మీ కోరిక. ఓ చిన్న మాట పట్టుకుని ఏదేదో ఊహించేస్తున్నారు. మీ కోరిక ఫలించదు. వైసీపీ-బీజేపీ కలిసి ఉన్నాయనేది ఓ అపొహే. నేను ప్రతి రోజూ వైసీపీని, సీఎంను విమర్శిస్తూనే ఉన్నాను. మాధవ్ వ్యాఖ్యలపై ఇంతకు మించి స్పందించను.

వైసీపీ ప్రభుత్వంపై ప్రజా పోరాటం చేస్తాం. క్షేత్ర స్థాయిలో పోరాటాలకు ప్లాన్ చేస్తాం. ప్రధానితో విశాఖలో జరిపిన భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు ఏపీ ప్రభుత్వంపై ఛార్జ్ షీట్ వేస్తాం” అని సోము వీర్రాజు చెప్పారు. కాగా, ఏపీలో ఇటీవలే ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు టీడీపీ గెలుచుకుని వైసీపీకి షాక్ ఇచ్చింది.

TSPSC Paper Leak : సిట్ దర్యాఫ్తు ముమ్మరం, రూ.14లక్షల ఆర్థిక లావాదేవీలపై ఆధారాల సేకరణ