Sankranti Special Trains 2024 : తెలుగు రాష్ట్రాల రైల్వే ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త‌.. సంక్రాంతికి 32 ప్ర‌త్యేక రైళ్లు.. ఏ ఏ మార్గాల్లోనంటే..?

సంక్రాంతికి ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది.

Sankranti Special Trains 2024 : తెలుగు రాష్ట్రాల రైల్వే ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త‌.. సంక్రాంతికి 32 ప్ర‌త్యేక రైళ్లు.. ఏ ఏ మార్గాల్లోనంటే..?

South Central Railway Running 32 special trains on Sankranti

Sankranti Special Trains : అతి పెద్ద పండుగ‌ల్లో సంక్రాంతి ఒక‌టి. ఈ పండుగను సొంతూళ్ల‌లో కుటుంబ స‌భ్యుల మ‌ధ్య జ‌రుపుకోవాల‌ని ప్ర‌తి ఒక్క‌రు భావిస్తుంటారు. అందుక‌నే విద్యా, ఉద్యోగం అంటూ ఎక్క‌డెక్క‌డో నివ‌సిస్తున్న వారు సైతం సంక్రాంతి సొంతూళ్ల‌కు ప్ర‌యాణం అవుతుంటారు. ఇప్ప‌టికే సాధార‌ణ రైళ్ల‌లోని సీట్లు నిండిపోయాయి. ఈ క్ర‌మంలో ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప్ర‌యాణీకుల‌కు శుభ‌వార్త చెప్పింది.

వివిధ మార్గాల్లో ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డ‌ప‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. జ‌న‌వ‌రి 7 నుంచి జ‌న‌వ‌రి 27 వ‌ర‌కు మొత్తం 32 రైళ్ల‌ను న‌డ‌ప‌నున్న‌ట్లు తెలియ‌జేసింది. హైదరాబాద్ -కాకినాడ, సికింద్రాబాద్-నర్సాపూర్‌, హైదరాబాద్‌-కొచ్చువేలి, కాచిగూడ-భువనేశ్వర్‌, సికింద్రాబాద్‌-గూడూరు, సికింద్రాబాద్‌-తిరుప‌తి, శ్రీకాకుళం-వికారాబాద్ మొద‌ల‌గు మార్గాల్లో ఈ ప్ర‌త్యేక రైళ్లు న‌డ‌వ‌నున్నాయి. ఈ ప్ర‌త్యేక రైళ్లు అన్నింటిలోనూ ఫ‌స్ట్ ఏసీ, సెకెండ్ ఏసీ, థ‌ర్డ్ ఏసీతో పాటు స్లీప‌ర్‌, జ‌న‌ర‌ల్ బోగీలు ఉండ‌నున్నాయి.

నా మద్దతుతోనే అధికారంలోకి వచ్చింది.. కాంగ్రెస్‌లో చేరికపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏ రోజు ఏ రూట్ల‌లో అంటే..

సికింద్రాబాద్ నుంచి బ్రహ్మపూర్ ( ట్రైన్ నంబ‌ర్ 07089 ) – జనవరి 7, 14 తేదీల్లో
బ్రహ్మాపూర్ నుంచి వికారాబాద్ (07090) – జనవరి 8, 15న‌
వికారాబాద్ నుంచి బ్రహ్మపూర్ (07091) – జనవరి 9, 16న‌
బ్రహ్మాపూర్ నుంచి సికింద్రాబాద్ (07092) – జనవరి 10, 17న‌
విశాఖపట్నం నుంచి కర్నూలు సిటీ (08541) – జనవరి 10, 17, 24 తేదీల్లో
కర్నూల్ సిటీ నుంచి విశాఖపట్నం (08542) – జనవరి 11, 18, 25 తేదీల్లో
శ్రీకాకుళం నుంచి వికారాబాద్ (08547) – జనవరి 12, 19, 26 తేదీల్లో
వికారాబాద్ నుంచి శ్రీకాకుళం (08548) – జనవరి 13, 20, 27 తేదీల్లో
సికింద్రాబాద్ నుంచి తిరుపతి (02764) – జనవరి 10, 17న‌
తిరుపతి నుంచి సికింద్రాబాద్ (02763) – జనవరి 11, 18న‌
సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ (07271) – జనవరి 12న‌
కాకినాడ టౌన్-సికింద్రాబాద్ (07272) – జనవరి 13న
సికింద్రాబాద్ – బ్రహ్మపూర్ (07093) – జనవరి 8, 15న‌
బ్రహ్మాపూర్ – సికింద్రాబాద్ (07094) – జనవరి 9, 16న‌
నర్సాపూర్ – సికింద్రాబాద్ (07251) – జనవరి 10న
సికింద్రాబాద్ – నర్సాపూర్ (07252) – జనవరి 11న