AP Rains : ఏపీలో చురుగ్గా రుతుపవనాలు.. ఈ జిల్లాల్లో నేడు భీకర గాలులతో వర్షాలు.. హెచ్చరికలు జారీ..
AP Rains : ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొన్న వివరాల ప్రకారం.. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నందున పలు జిల్లాల్లో నేడు ఈదురు గాలులతో కూడిన అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
AP Rains
- ఏపీలో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు
- హెచ్చరికలు జారీ చేసిన ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ
- పలు ప్రాంతాల్లో భీకర గాలులు వీచే అవకాశం
AP Rains : ఏపీలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. రెండుమూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం, ద్రోణి కారణంగా రాష్ట్రంలో ఇవాళ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ఈదురుగాలులు తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొన్న వివరాల ప్రకారం.. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నందున పలు జిల్లాల్లో నేడు ఈదురు గాలులతో కూడిన అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇవాళ అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, నంద్యాల, కడప, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్సాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
పోలవరం, అనకాపల్లి, కాకినాడ, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరుతో పాటుగా మరికొన్ని రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరించారు. వర్షాలు పడే సమయంలో, ఈదురుగాలుల సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగులు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లాలని అధికారులు సూచించారు.
గురువారం ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ముఖ్యంగా విజయవాడలో గురువారం తెల్లవారు జామున భారీ వర్షం కురిసింది. చాలా కాలనీల్లో మోకాలిలోతులో ఇళ్లలోకి నీరు చేరింది. వాహనదారులు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాల్లో గాలివాన బీభత్సం కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఇవాళ కూడా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందంని, పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు తీవ్రత ఎక్కువగా ఉంటుందని, పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.
