Aarogyasri App : ఆరోగ్యశ్రీ సేవలకు ప్రత్యేక యాప్.. సమాచారం మరింత సులభం
ఆరోగ్యశ్రీ పథకంపై ప్రజలకు సులభమైన మార్గంలో సమాచారం అందేలా ఓ యాప్ తీసుకురావాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. ఏ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవలు లభిస్తాయి? రోగులు ఏ ఆసుపత్రికి..

Aarogyasri App
Aarogyasri App : ఆరోగ్యశ్రీ పథకంపై ప్రజలకు సులభమైన మార్గంలో సమాచారం అందేలా ఓ యాప్ తీసుకురావాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. ఏ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవలు లభిస్తాయి? రోగులు ఏ ఆసుపత్రికి వెళ్లాలి? అనే అంశాలకు యాప్ ద్వారా సరైన మార్గదర్శనం చేయాలన్నారు. 108 ఆసుపత్రుల్లోనూ ఇలాంటి సమాచారం ఉండాలని, 104ను కూడా ఆ మేరకు అభివృద్ధి చేయాలని స్పష్టం చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. గ్రామ, పట్టణ ప్రాంతాల్లో క్లినిక్స్ నిర్మాణం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాడు-నేడు పనుల పురోగతిని సమీక్షించారు.
WhatsApp Privacy Update : వాట్సాప్‌లో న్యూ అప్‌డేట్.. ఈ కొత్త ప్రైవసీతో వారికి చెక్ పెట్టొచ్చు..!
ఆరోగ్యశ్రీ పథకంలో ‘రిఫరల్’ అన్నది ఎంతో కీలమైందని, యాప్ ద్వారా దాన్ని మరింత పురిపుష్టం, సరళతరం చేయాలని సీఎం జగన్ సూచించారు. ఈ రిఫరల్ విధానానికి విలేజ్ క్లినిక్ అనేది కేంద్రంగా మారాలని అభిలషించారు. ఈ యాప్ లో రోగుల సందేహాలను నివృత్తి చేసే సదుపాయం కూడా కల్పించాలని అధికారులకు తెలిపారు. రాష్ట్రంలోని ఆరోగ్య మిత్రలకు సెల్ ఫోన్లు ఇచ్చి, అందులో ఆరోగ్యశ్రీ యాప్ పొందుపరిచే ప్రతిపాదనకు సీఎం ఆమోదం తెలిపారు.
వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని జగన్ ఆదేశించారు. కేంద్రంతో సమన్వయం చేసుకుని జనవరిలోగా నిర్దేశించిన వయస్సుల వారందరికీ డబుల్ డోసులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యాక్సినేషన్‌ను త్వరగా పూర్తి చేయడమే కోవిడ్ నివారణకు పరిష్కారం అన్నారు.
WhatsApp New Scam : ఆ మెసేజ్ వచ్చిందా? అయితే బీ కేర్ ఫుల్.. వాట్సాప్ యూజర్లకు వార్నింగ్
ఎయిర్‌పోర్టుల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నామని సీఎం జగన్ కి వివరించారు అధికారులు. ఒమిక్రాన్ నేపథ్యంలో ఆంక్షలు విధించామన్నారు. మరో వారం రోజుల్లో జీన్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఫీవర్ సర్వే కంటిన్యూ చేస్తామని తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో ఈ నెలాఖరు నాటికి 144 పీఎస్‌ఏ ప్లాంట్లు అందుబాటులోకి వస్తాయని అధికారులు చెప్పారు.