Special vehicles disabled : దివ్యాంగులకు ఉచితంగా ప్రత్యేక వాహనాలు
ఏపీ ప్రభుత్వం దివ్యాంగులకు తీపి కబురు అందించింది. దివ్యాంగులకు ప్రత్యేక వాహనాలను ఉచితంగా సమకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Special Vehicles Free Of Charge For The Disabled In Ap
Special vehicles free of charge for the disabled : ఏపీ ప్రభుత్వం దివ్యాంగులకు తీపి కబురు అందించింది. దివ్యాంగులకు ప్రత్యేక వాహనాలను ఉచితంగా సమకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వారి విద్య, ఉపాధికి దోహదపడేలా రూపొందించిన ఈ వాహనాల కోసం అర్హులు దరఖాస్తు చేసుకోవాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ ఉత్తర్వులు జారీ చేశారు.
వార్షికాదాయం 3 లక్షల్లోపు కలిగి, 18 – 45 మధ్య వయసు ఉండాలి. 70 శాతం, ఆ పైగా వైకల్యం ఉండాలి. గ్రాడ్యుయేషన్, ఆ పై చదువులు చదివే విద్యార్థులు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలతో సహా స్వయం ఉపాధి లేదా పదో తరగతి ఉత్తీర్ణతతో కనీసం ఏడాది నుంచి పని చేస్తున్న దివ్యాంగులకు వీటిని ఇస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. లేకుంటే ప్రత్యేక వాహనం పొందడానికి ఎంపికైన దివ్యాంగులు రెండు నెలల్లోగా డ్రైవింగ్ లైసెన్స్ పొందాలి.
జిల్లా యూనిట్‌గా అర్హులైన వికలాంగులను జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన గల కమిటీ ఎంపిక చేస్తుంది. ఇందులో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లతో పాటు 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తారు. తొలుత వికలాంగులైన మహిళలకు ప్రాధాన్యం ఇస్తారు. తర్వాత పురుషులను ఎంపిక చేస్తారు. అర్హులైన దివ్యాంగులు ఏ జిల్లా నుంచి అయినా దరఖాస్తు చేసుకోవచ్చు.