Spicejet : ఢిల్లీ టు తిరుపతి, కొత్త విమాన సర్వీసు

దేశ రాజధాని ఢిల్లీ నుంచి తిరుపతి నగరాల మధ్య నూతన విమాన సర్వీసు ప్రారంభమైంది.

Spicejet : ఢిల్లీ టు తిరుపతి, కొత్త విమాన సర్వీసు

Spice Jet

Updated On : October 17, 2021 / 8:05 PM IST

Delhi And Tirupati : ఏపీలో ఉన్న ప్రముఖ ఆలయమైన తిరుపతి శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు దేశం నలుమూలల నుంచి రోడ్డు, రైలు, విమాన సౌకర్యాలున్నాయి. దీంతో తిరుపతి భక్తులతో ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది. తాజాగా…దేశ రాజధాని ఢిల్లీ నుంచి తిరుపతి నగరాల మధ్య నూతన విమాన సర్వీసు ప్రారంభమైంది.

Read More : Happiest Cities : ఈ నగరాల్లో ఇల్లు కొనుగోలు చేస్తే జీవితమంతా ఫుల్ హ్యాపీ.. భారత్‌లో ఎక్కడ అంటే..

స్పైస్ జెట్ విమానయాన సంస్థకు చెందిన ఈ సర్వీసును పౌర విమానయాన శాఖ మంత్ర జ్యోతిరాదిత్య సింధియా 2021, అక్టోబర్ 17వ తేదీ ఆదివారం దీనిని ప్రారంభించారు. ఆదివారం ఉదయం 9.50 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.10 గంటలకు తిరుపతికి విమానం చేరుకుంది. ఈ సందర్భగా..సింధియా మాట్లాడుతూ…స్పైస్ జెట్ సంస్థ తన నూతన సర్వీసు ద్వారా దేశ రాజకీయ రాజధాని ఢిల్లీని ఆధ్మాత్మిక రాజధాని తిరుపతితో కలుపుతోందని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏటా 3.5 కోట్ల మంది భక్తులు దర్శించుకుంటున్నారని తెలిపారు.