Srivari Sarvadarshanam : టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో శ్రీవారి సర్వదర్శనం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 15 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వ దర్శనం కలుగుతుందని టీడీపీ అధికారులు పేర్కొన్నారు.

Srivari Sarvadarshanam : టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో శ్రీవారి సర్వదర్శనం

Tirumala

Updated On : February 11, 2023 / 3:07 PM IST

Srivari Sarvadarshanam : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 15 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వ దర్శనం కలుగుతుందని టీడీపీ అధికారులు పేర్కొన్నారు. నిన్న(శుక్రవారం 10,2023) శ్రీవారిని 57,702 మంది దర్శించుకోగా 27,482 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.

భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.3.42 కోట్లు వచ్చిందని తెలిపారు. తిరుపతి శ్రీనివాసమంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు శుక్రవారం (ఫిబ్రవరి10,2023) సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది.

Tirumala Srivaru : ఫిబ్రవరి 13న శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల

సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం అనంతరం శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పరణం నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాల కారణంగా ఆలయంలో అన్ని రకాల ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.