Tirumala Srivaru : ఫిబ్రవరి 13న శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. ఈనెల 22 నుంచి 28 వరకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది.

srivaru
Tirumala Srivaru : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. ఈనెల 22 నుంచి 28 వరకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ నెల 13న ఉదయం 9 గంటలకు ప్రత్యేక దర్శనం టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు పేర్కొంది.
ఫిబ్రవరి 1 నుంచి 21వ తేదీ వరకు జనవరి కోటాను జనవరిలో విడుదల చేసిన విషయం తెలిసిందే. బాలాలయం కార్యక్రమం సందర్భంగా ఆయా రోజుల్లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను విడుదల చేయలేదు. బాలాలయాన్ని వాయిదా వేయగా.. టికెట్లను విడుదల చేయనుంది. ఈ మేరకు భక్తులు ఈ విషయాన్ని గమించాలని టీటీడీ కోరింది.