Students issues in AP: పీజీ విద్యార్ధులను హాస్టల్ నుంచి బయటకు పంపిన సిబ్బంది

యూనివర్సిటీ హాస్టల్లో ఉంటున్న పీజీ విద్యార్థులను హాస్టల్ సిబ్బంది.. బయటకు నెట్టివేశారు. మెస్‌చార్జీల బకాయిలు చెల్లించనందుకే విద్యార్థులను బయటకు పంపినట్లు చెబుతున్న హాస్టల్ సిబ్బంది

Students issues in AP: పీజీ విద్యార్ధులను హాస్టల్ నుంచి బయటకు పంపిన సిబ్బంది

Rayalaseema

Updated On : February 20, 2022 / 11:59 AM IST

Students issues in AP: కర్నూలు జిల్లాలోని రాయలసీమ యూనివర్సిటీలో పీజీ విద్యార్థులకు. హాస్టల్ అధికారుల నుంచి ఇబ్బందులు ఎదురయ్యాయి. యూనివర్సిటీ హాస్టల్లో ఉంటున్న పీజీ విద్యార్థులను హాస్టల్ సిబ్బంది.. బయటకు నెట్టివేశారు. మెస్‌చార్జీల బకాయిలు చెల్లించనందుకే విద్యార్థులను బయటకు పంపినట్లు హాస్టల్ సిబ్బంది చెబుతున్నారు. గత కొన్ని నెలలుగా విద్యార్థులు ఫీజు చెల్లించక పోవడంతో వారిని హాస్టల్ నుంచి పంపించి వేసినట్లు హాస్టల్ సిబ్బంది పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం నుంచి అందాల్సిన “జగనన్న వసతి దీవెన పథకం” డబ్బులు ఇంతవరకు రాలేదని, డబ్బులు రాకపోవడంతో హాస్టల్ ఫీజులు ఎలా చెల్లించగలమంటూ విద్యార్థులు వాపోయారు. వర్సిటీ అధికారుల తీరుపై ఆగ్రహం విద్యార్థులు, విద్యార్థి సంఘాలు వ్యక్తం చేశాయి. చివరకు మరో రెండు రోజుల్లో బకాయిలు చెల్లించాలని గడువు ఇచ్చిన అధికారులు తాత్కాలికంగా విద్యార్థులను హాస్టల్లోకి అనుమతించారు.

Also read: Indian Students : కెనడాలో భారతీయ విద్యార్థుల అవస్థలు.. అండగా భారత హైకమిషన్..!