మోడీ కాలకేయుడు : లోకేష్ ట్వీట్

ఏపీలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. యూటర్న్ తీసుకున్న చంద్రబాబు భళ్లాల దేవుడంటూ ప్రధాని మోడీ విమర్శిస్తే.. దానికి ఏపీ మంత్రి లోకేష్ కౌంటర్ ఇచ్చారు. గుజరాత్‌లో నరమేధం సృష్టించిన మోడీ….అరవీర భయంకరులైన భళ్లాలదేవుడికి సరిసాటి…కాలకేయుడికి పోటీ అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.
కేంద్రం నుంచి ఒక్క పైసా సాయం లేకపోయినా ఆంధ్రులు తలెత్తుకుని నిలబడేలా చేసిన బాహుబలి ముఖ్యమంత్రి చంద్రబాబు అని పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వకుండా దండయాత్ర చేస్తున్న కాలకేయుడు మోడీ అని విమర్శించారు. 54 వేల కోట్లయ్యే పోలవరం ప్రాజెక్టుకు 6 వేల కోట్లిచ్చి పూర్తి చేయలేదని ప్రధాని అంటున్నారని… మోడీకి లెక్కలు రావా…ఆంధ్రుల జీవనాడి పోలవరం అంటే లెక్క లేదా అని లోకేష్ మండిపడ్డారు.
ఏపీకి ప్రత్యేకహోదా ఎత్తేసి దండయాత్ర చేస్తున్న కాలకేయుడు @narendramodi గారూ! కేంద్రం నుండి ఒక్క పైసా సహాయం లేకపోయినా ఆంధ్రులు తలెత్తుకొని నిలబడేలా చేసిన బాహుబలి మా ముఖ్యమంత్రి @ncbn గారు#ModiIsAMistake
— Lokesh Nara (@naralokesh) April 1, 2019