ప్రజా చైతన్య యాత్ర జరిగేనా : విశాఖ ఎయిర్ పోర్టులోనే బాబు

  • Published By: madhu ,Published On : February 27, 2020 / 08:10 AM IST
ప్రజా చైతన్య యాత్ర జరిగేనా : విశాఖ ఎయిర్ పోర్టులోనే బాబు

Updated On : February 27, 2020 / 8:10 AM IST

విశాఖ ఎయిర్ పోర్టు వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. రణరంగాన్ని తలపిస్తోంది. ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లిన…ప్రతిపక్ష నేత చంద్రబాబును విమానాశ్రయం వద్దే వైసీపీ లీడర్స్ అడ్డుకున్నారు. బాబు గో బ్యాక్ అంటూ పెద్ద పెట్టు నినాదాలు చేయడంతో ఆ ప్రాంతం మారుమ్రోగింది. అటు బాబు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. వాహనాన్ని అడ్డుకోవడంతో..కాలినడకన వెళ్లేందుకు ఆయన ప్రయత్నించారు.

కానీ పోలీసులు వారించారు. ముందుకు కదలవద్దని సూచించారు. వాహనంలోనే కూర్చొబెట్టారు. ఇలా గంటల పాటు ఆయన అందులోనే కూర్చొండిపోయారు. విశాఖలో భూ కుంభకోణాన్ని బయటపెట్టి తీరుతానని తేల్చిచెబుతున్నారు. అటు వైసీపీ మాత్రం..చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహి అంటూ విమర్శిస్తున్నారు. బాబు పర్యటనను ఎలాగైనా అడ్డుకుంటామని చెబుతున్నారు. 

2020, ఫిబ్రవరి 27వ తేదీ గురువారం ఉత్తరాంధ్ర పర్యటనకు బాబు రెడీ అయ్యారు. అందులో భాగంగా గురువారం ఉదయం విశాఖకు చేరుకున్నారు. మొదటి నుంచి బాబు యాత్రను అడ్డుకుంటామని చెబుతున్న వైసీపీ నేతలు అనుకున్నంత పనిచేశారు. ఎయిర్ పోర్టు నుంచి బాబును బయటకు రాకుండా అడ్డుకున్నారు. భారీ సంఖ్యలో వైసీపీ నేతలు ఉండడంతో వీరిని నిలువరించడం పోలీసులకు కష్టతరమౌతోంది.

గంటల తరబడి అక్కడే ఉండిపోయారు. ప్రస్తుతం బాబుతో పోలీసులు చర్చలు జరుపుతున్నారు. ఎయిర్ పోర్టు లాబీలోకి తిరిగి వెళ్లాలని పోలీసులు కోరుతున్నారు. దీంతో ఎయిర్ పోర్టు పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. 

* విశాఖ ఎయిర్‌పోర్టు వద్ద టెన్షన్ టెన్షన్
* ఎయిర్‌పోర్టుకు చేరుకున్న చంద్రబాబు. 
* అడ్డుకునేందుకు ప్రయత్నించిన వైసీపీ కార్యకర్తలు.

* చంద్రబాబు వాహనం ఎదుట వైసీపీ నిరసన.
* చంద్రబాబుపై చెప్పులు విసిరేందుకు యత్నం.
* ఎయిర్‌పోర్టు బయటకు వచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నాలు.

* కొనసాగుతున్న వైసీపీ కార్యకర్తల నిరసనలు.
* పార్టీ నేతలతో బాబు టెలీకాన్ఫరెన్స్.
* వైజాగ్‌ బ్రాండ్‌ను దెబ్బ తీసిన వైసీపీకి.. టీడీపీని ప్రశ్నించే అర్హత లేదంటున్న బాబు. 

Read More : ఢిల్లీలో అల్లర్లు తగ్గుముఖం..35కి పెరిగిన మృతులు