TDP Digital Mahanadu : వర్చువల్ మహానాడు, చివరి రోజు కీలక తీర్మానాలు
తెలుగుదేశం పార్టీ వర్చువల్‌గా నిర్వహిస్తున్న మహానాడు 2021, మే 28వ తేదీ శుక్రవారంతో ముగియనుంది. చివరి రోజు కీలక తీర్మానాలను మహానాడు ఆమోదించనుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పలు తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. టీడీపీ భవిష్యత్ కార్యాచరణ, రాజకీయ నివేదికపైనా చర్చ జరుగనుంది. అనంతరం వీటన్నింటిని టీడీపీ నేతలు ఆమోదించనున్నారు.

Mahanadu
Mahanadu 2021 : తెలుగుదేశం పార్టీ వర్చువల్‌గా నిర్వహిస్తున్న మహానాడు 2021, మే 28వ తేదీ శుక్రవారంతో ముగియనుంది. చివరి రోజు కీలక తీర్మానాలను మహానాడు ఆమోదించనుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పలు తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. టీడీపీ భవిష్యత్ కార్యాచరణ, రాజకీయ నివేదికపైనా చర్చ జరుగనుంది. అనంతరం వీటన్నింటిని టీడీపీ నేతలు ఆమోదించనున్నారు.
మొదటి రోజు మహానాడు సమావేశాల్లో వైసీపీ ప్రభుత్వం టార్గెట్‌గా నేతలు పలు తీర్మానాలు, ప్రసంగాలు చేశారు. అదుపు లేని ధరలు, పెంచిన పన్నులు, అప్పులపై తీర్మానం చేశారు. పార్టీ అధినేత చంద్రబాబు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. ముందు చూపు లేని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవటం దౌర్భాగ్యమని విమర్శించారు. సంపద సృష్టించలేక ఆర్థిక సంక్షోభంలోకి రాష్ట్రాన్ని నెట్టేస్తున్నారన్నారని.. రాష్ట్రంలో మాట్లాడే వారి నోరు మూయించేలా స్టేట్ టెర్రరిజానికి పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు చంద్రబాబు.
ఇక టీడీపీ నేతలపై నమోదవుతున్న కేసులపై కూడా చంద్రబాబు స్పందించారు.. అచ్చెన్నాయుడుతో మొదలు పెట్టిన అక్రమ కేసులు.. బీసీ జనార్థన్ రెడ్డి వరకూ కొనసాగించారని మండిపడ్డారు. రఘురామకృష్ణంరాజుపై తప్పుడు కేసులు పెట్టి పోలీసు కస్టడీలో హింసించారని ఆరోపించారు. స్థానికంగా అంతా మేనేజ్ చేసి సుప్రీం కోర్టులో అడ్డంగా దొరికి పోయారని విమర్శించారు. వైద్యుడు సుధాకర్, కోడెల శివప్రసాదరావు సహా ఎంతోమంది ప్రభుత్వ వేధింపులు భరించలేక చనిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడి ప్రసంగంతో మహానాడు సమావేశాలు ముగుస్తాయి.
Read More : Rape Case: అత్యాచార కేసు నిందితులపై పోలీసుల కాల్పులు