చింతమనేని ప్రభాకర్ అరెస్ట్

చింతమనేని ప్రభాకర్ అరెస్ట్

Updated On : February 18, 2021 / 5:02 PM IST

TDP EX-MLA chintamaneni prabhakar Arrested : పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే  టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్ ని   ఏలూరు పోలీసులు అరెస్టు చేశారు. పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం  ఏలూరు మండలం మాదేవల్లికి వచ్చిన ఆయనను ఏలూరు గ్రామీణ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు  తీసుకెళ్లారు.

పెదవేగి మండలం బి.సింగవరం గ్రామంలో నిన్న రాత్రి చింతమనేని ప్రభాకర్ ప్రచారం నిర్వహించారు. అనంతరం వైసీపీ-టీడీపీ నేతల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ  ఘర్షణలో సర్పంచ్ అభ్యర్ది భర్త శామ్యూల్‌పై చింతమనేని, ఆయన అనుచరులు దాడిచేశారు. దాడిలో బాధితుడు తీవ్రంగా గాయపడ్డారు. వారి ఫిర్యాదు మేరకు స్పందించిన పెదవేగి పోలీసులు గురువారం మధ్యాహ్నం చితమనేనిని అరెస్ట్‌ చేశారు.

ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.  ప్రస్తుతం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరి కొద్ది సేపట్లో  న్యాయమూర్తి ముందు హాజరుపరచున్నారు. చింతమనేనిపై  ఐపీసీ సెక్షన్ 341,324,143, 323, 354, 354a,171సీ, 506(2), 455 R/w 149 కింద కేసు నమోదు చేశారు.   ఘటనా స్థలంలో చింతమనేని లేనప్పటికీ వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు ఆయన పైనా కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.