AP Municipality Elections : ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ హవా.. అక్కడ చక్రం తిప్పిన బాలయ్య..

వారిలో చాలామంది టీడీపీలోకి జంప్ అయ్యారు. దాంతో టీడీపీ బలం 3 నుంచి 33కి పెరిగింది.

AP Municipality Elections : ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ హవా.. అక్కడ చక్రం తిప్పిన బాలయ్య..

Updated On : February 4, 2025 / 1:24 AM IST

AP Municipality Elections : ఏపీలో పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ హవా కనిపించింది. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్, ఛైర్మన్ల ఎన్నికల్లో అధికార టీడీపీ సత్తా చాటింది. నెల్లూరు కార్పొరేషన్ తో పాటు ఏలూరులో రెండు డిప్యూటీ మేయర్ స్థానాలను టీడీపీ గెలుచుకుంది.

అలాగే హిందూపురం మున్సిపాలిటీని కూడా టీడీపీ కైవసం చేసుకుంది. హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ గా 6వ వార్డు కౌన్సిలర్ డీఈ రమేశ్ ఎన్నికయ్యారు. మున్సిపల్ ఛైర్మన్ కు మద్దతుగా టీడీపీకి 23 ఓట్లు వచ్చాయి. హిందూపురం మున్సిపాలిటీ కైవసం చేసుకోవడంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చక్రం తిప్పారు.

ఇక నెల్లూరు డిప్యూటీ మేయర్ గా సయ్యద్ తహసీన్ విజయం సాధించారు. ఏలూరు కార్పొరేషన్ టీడీపీ వశమైంది. డిప్యూటీ మేయర్లుగా ఉమామహేశ్వరరావు, దుర్గాభవాని ఎన్నికయ్యారు. అటు తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది.

Also Read : తెలంగాణలో డ్రై పోర్ట్.. ఎక్కడ నిర్మిస్తారు? ఉపయోగాలు ఏంటి? పూర్తి వివరాలు..

తిరుపతి ఎన్నిక వ్యవహారంలో పెద్ద గొడవే జరిగింది. తమ పార్టీకి చెందిన ఐదుగురు కార్పొరేటర్లు కిడ్నాప్ నకు గురయ్యారని వైసీపీ ఆరోపించింది. కోరం లేని పరిస్థితుల్లో ఎన్నికను వాయిదా వేశారు.

నెల్లూరులో పూర్తిగా టీడీపీ హవా కొనసాగింది. అక్కడ టీడీపీ కార్పొరేటర్లు 41 మంది కాగా, వైసీపీ బలం 12కి పడిపోయింది. ఏలూరులో టీడీపీ కార్పొరేటర్ల బలం 33కి పెరిగింది. 3 నుంచి 33 మందికి బలం పెరిగింది. అక్కడ వాస్తవానికి 47 మంది వైసీపీ నుంచి కార్పొరేటర్లు గెలిచారు. వారిలో చాలామంది టీడీపీలోకి జంప్ అయ్యారు. దాంతో టీడీపీ బలం 3 నుంచి 33కి పెరిగింది. అలా టీడీపీకి మున్సిపల్ కార్పొరేషన్ దక్కింది.