Dry Port in Telangana : తెలంగాణలో డ్రై పోర్ట్.. ఎక్కడ నిర్మిస్తారు? ఉపయోగాలు ఏంటి? పూర్తి వివరాలు..

సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో డ్రై పోర్ట్ అనేది ఆసక్తికరంగా మారింది. డ్రై పోర్ట్ గురించి డిస్కషన్ మొదలైంది.

Dry Port in Telangana : తెలంగాణలో డ్రై పోర్ట్.. ఎక్కడ నిర్మిస్తారు? ఉపయోగాలు ఏంటి? పూర్తి వివరాలు..

Updated On : February 3, 2025 / 9:02 PM IST

Dry Port in Telangana : తెలంగాణలో డ్రై పోర్ట్ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అసలు డ్రై పోర్ట్ అంటే ఏమిటి? దాన్ని ఎక్కడ నిర్మిస్తారు? డ్రై పోర్ట్ వల్ల ప్రయోజనాలు ఏంటి? అనేది ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

సముద్ర ప్రాంతాల్లో పోర్టులు (ఓడరేవులు) ఉంటాయనే విషయం తెలిసిందే. కానీ సముద్రం లేని చోట నిర్మించే పోర్టులనే డ్రై పోర్ట్ అంటారు. ఇటీవల దావోస్ లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి బృందం.. పెట్టుబడులను అట్రాక్ట్ చేసేందుకు తెలంగాణలో డ్రై పోర్ట్ నిర్మిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ పోర్టును మచిలీపట్నం రోడ్డు, రైలు మార్గాల ద్వారా అనుసంధానం చేస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో డ్రై పోర్ట్ అనేది ఆసక్తికరంగా మారింది. డ్రై పోర్ట్ గురించి డిస్కషన్ మొదలైంది.

డ్రై పోర్ట్ అంటే..
డ్రై పోర్ట్ అని ఎందుకు అంటారంటే.. ఇది సముద్రానికి దగ్గరగా ఉండదు. అందుకే అలా పిలుస్తారు. డ్రై పోర్టుని మల్టీ మోడల్ లాజిస్టిక్స్ సెంటర్ అని కూడా పిలుస్తారు. దీన్ని రోడ్డు, రైలు మార్గాల ద్వారా పోర్టులకు (ఓడ రేవు) కనెక్షన్ చేస్తారు. ఇక, ఇవి.. ఎక్స్ పోర్ట్, ఇంపోర్ట్ లకు ట్రాన్సిట్ హబ్స్ గా (రవాణ కేంద్రంగా) ఉంటాయి.

Also Read : ఇండియన్ మార్కెట్‌లో చైనీస్ ఫోన్ హవా.. ఐఫోన్, సాంసంగ్‌ని తొక్కుకుంటూ పోతుంది..

కంటైనర్ యార్డులు, వేర్‌హౌస్‌లు, కార్గో నిర్వహణ సామాగ్రి, ఎక్స్ పోర్ట్, ఇంపోర్ట్ క్లియరెన్స్‌కు డ్రై పోర్ట్‌లో అధికార యంత్రాంగం, ఇతర వ్యవస్థ ఉంటుంది. సీ పోర్ట్ తరహాలోనే ఇక్కడా కస్టమ్స్ వ్యవస్థ ఉంటుంది. డ్రై పోర్ట్‌కు కనెక్ట్ చేసిన సీ పోర్ట్ ద్వారా వస్తువులు ఎగుమతి, దిగుమతి చేసుకోవచ్చు. డ్రై పోర్ట్ వల్ల సీ పోర్టులపై భారం తగ్గుతుంది.

తెలంగాణలో డ్రై పోర్ట్ నిర్మాణంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందుకోసం సంగారెడ్డి జిల్లా వేదిక కానుందని సమాచారం. తూప్రాన్ సమీపంలోని మనోహరాబాద్‌లో డ్రై పోర్ట్ నిర్మించనున్నారని తెలుస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో.. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా డ్రై పోర్ట్ నిర్మిస్తాయట. ఇందుకోసం 350 ఎకరాల భూసేకరణ జరిగినట్లు సమాచారం.

డ్రై పోర్ట్ నిర్మాణానికి మనోహరాబాద్ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి కారణం లేకపోలేదు. మనోహరాబాద్ ప్రాంతం జాతీయ రహదారికి సమీపంలో ఉంటుంది. పైగా.. డ్రై పోర్ట్ ను రోడ్డు, రైలు మార్గం ద్వారా మచిలీపట్నం పోర్టుకు అనుసంధానించడానికి అనువుగా ఉంటుందట.

Also Read : అధికారుల వినూత్న ప్రయోగం.. రైతులు ఫుల్ ఖుషీ.. క్షణాల్లో చేరుతున్న సమాచారం.. ఆ జిల్లాలో ప్రతి మండలానికి ఓ వాట్సాప్ గ్రూప్..

తెలంగాణలో డ్రై పోర్ట్ నిర్మాణ ప్రతిపాదన ఇప్పటిది కాదు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి దీని నిర్మాణం గురించి చర్చ నడుస్తోంది. 2015 జులైలో తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ డ్రై పోర్ట్ పై ఒక ప్రకటన చేసింది. నల్గొండ జిల్లాలో డ్రైపోర్ట్ ఏర్పాటుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నాలు కూడా చేసిందట. డ్రై పోర్ట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వానికి, చైనాకు చెందిన నిర్మాణరంగ సంస్థకు 2015లో ఎంవోయూ కుదిరినట్టు సమాచారం. ఆ తర్వాత 2021 జులైలో నల్గొండ దగ్గర 1400 ఎకరాల్లో డ్రై పోర్ట్ నిర్మాణ ప్రతిపాదనకు కేసీఆర్ సర్కార్ ఆమోదం కూడా తెలిపిందట.

డ్రై పోర్ట్‌తో అనేక ఉపయోగాలు..
డ్రై పోర్ట్ వల్ల ఆర్థికంగా లాభం
కార్గో నిర్వహణ, స్టోరేజ్, ప్రాసెసింగ్ స్థానికంగా చేసుకునే వెసులుబాటు
మచిలీపట్నం పోర్టు ద్వారా ఎగుమతులు, దిగుమతులు