Srisailam TDP : శ్రీశైలంలో టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ మధ్య వివాదం.. అధిష్టానం సీరియస్..!
Srisailam TDP : ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని అధినేత చంద్రబాబు వద్దకు పిలిపించాలని టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.

Srisailam TDP
Srisailam TDP : శ్రీశైలం పాలిటిక్స్ హాట్ టాపిక్ అయ్యాయి. శ్రీశైలం నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ మధ్య తలెత్తిన వివాదంపై అధిష్టానం సీరియస్ అయింది. ఎమ్మెల్యే లేకుండా ఎంపీ కార్యక్రమం నిర్వహించడం వివాదస్పదమైంది. ఇరువురి మధ్య ఘర్షణను అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది.
అందులోనూ మాజీ మంత్రితో కలిసి కార్యక్రమంలో పాల్గొనడంతో ఇరువురి మధ్య వివాదం మరింత ముదిరింది. ఈ ఘటనతో కర్నూలు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇరువురి నేతల వ్యవహర శైలిపై అధిష్టానం సీరియస్ అయింది. ఈ క్రమంలోనే ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని అధినేత చంద్రబాబు వద్దకు పిలిపించాలని నిర్ణయం తీసుకుంది.
నియోజకవర్గ ఎమ్మెల్యే లేకుండా ఎంపీ ఏరాసు ప్రతాపరెడ్డితో కలిసి కార్యక్రమం నిర్వహించారు. దాంతో ఇరువర్గాల మధ్య వివాదం చెలరేగింది. ఈ విషయంలో అధిష్టానం వివరణ కోరింది. కానీ, తప్పు ఎదుటి వారిదేనని ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. అమరావతి వచ్చి అధినేత ముందు హాజరుకావాలని ఇరువర్గాలకు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆదేశించారు.