AP Elections 2024: గుంటూరు నుంచి ఎన్నికల్లో పోటీ చేసే 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరే?

వైసీపీ నుంచి ఉమ్మారెడ్డి వెంకటరమణ, నందిగం సురేశ్‌, అనిల్‌కుమార్‌ యాదవ్‌, విడదల రజని, మేకతోటి సుచరిత..

AP Elections 2024: గుంటూరు నుంచి ఎన్నికల్లో పోటీ చేసే 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరే?

TDP JanaSena YCP candidates contesting from Guntur

Updated On : February 16, 2024 / 8:18 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో మరికొన్ని వారాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై పార్టీలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. గుంటూరు పార్లమెంట్, అసెంబ్లీ నియోజక వర్గాలపై ప్రధాన పార్టీలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాయి. రాష్ట్ర రాజకీయాల్లో హేమాహేమీల వంటి వారు ఆయా నియోజక వర్గాల్లో ఉన్నారు.

ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ నుంచి ఉమ్మారెడ్డి వెంకటరమణ, నందిగం సురేశ్‌, అనిల్‌కుమార్‌ యాదవ్‌, విడదల రజని, మేకతోటి సుచరిత, కిలారి రోశయ్య, అంబటి రాంబాబు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వంటి హేమాహేమీలు బరిలోకి దిగనున్నారు.

టీడీపీ-జనసేన నుంచి ఉండవల్లి శ్రీదేవి, లావు శ్రీకృష్ణదేవరాయలు, తెనాలి శ్రవణ్‌కుమార్, నారా లోకేశ్‌, నాదెండ్ల మనోహర్, ధూళిపాళ్ల నరేంద్ర, కన్నా లక్ష్మీనారాయణ, పత్తిపాటి పుల్లారావు పోటీకి దిగే అవకాశం ఉంది.

ఏయే పార్టీ ఏయే అభ్యర్థిని బరిలోకి దింపే అవకాశాలు ఉన్నాయో చూద్దాం..

పార్లమెంట్ స్థానాలు

గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గం
ఉమ్మారెడ్డి వెంకటరమణ, వైసీపీ అభ్యర్థి
పెమ్మసాని చంద్రశేఖర్‌, ఎన్‌ఆర్‌ఐ
భాష్యం రామకృష్ణ, విద్యాసంస్థల అధినేత
——————-
బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గం
నందిగాం సురేశ్‌, సిట్టింగ్‌ ఎంపీ
ఉండవల్లి శ్రీదేవి, తాడికొండ ఎమ్మెల్యే
—————————
నరసారావుపేట పార్లమెంట్‌ నియోజకవర్గం
అనిల్‌కుమార్‌యాదవ్‌, మాజీ మంత్రి
లావు శ్రీకృష్ణదేవరాయలు, సిట్టింగ్‌ ఎంపీ

అసెంబ్లీ స్థానాలు
1. గుంటూరు ఈస్ట్ నియోజకవర్గం
నూర్ ఫాతిమా
వైసీపీ ఇన్‌చార్జి
నేరెళ్ల సురేశ్‌, జనసేన
నసీన్ అహ్మద్, టీడీపీ ఇన్‌చార్జి
డేగల ప్రభాకర్, అర్బన్‌ టీడీపీ అధ్యక్షుడు
పోటీలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి

2. గుంటూరు వెస్ట్ నియోజకవర్గం
విడదల రజని, వైసీపీ అభ్యర్థి
బోనబోయిన శ్రీనివాసయాదవ్, జనసేన
కోవెలమూడి రవీంద్ర,
టీడీపీ టికెట్‌ రేసులో ఉయ్యూరు శ్రీనివాస్, ఎన్నారై, మన్నవ మోహన కృష్ణ

3. తాడికొండ నియోజకవర్గం
మేకతోటి సుచరిత, వైసీపీ అభ్యర్థి
తెనాలి శ్రవణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే

4 మంగళగిరి నియోజకవర్గం
గంజి చిరంజీవులు, వైసీపీ అభ్యర్థి
నారా లోకేశ్‌, టీడీపీ ప్రధాన కార్యదర్శి

5. తెనాలి నియోజకవర్గం
అన్నాబత్తుల శివకుమార్‌, ఎమ్మెల్యే
నాదెండ్ల మనోహర్, జనసేన
పొత్తుల్లో భాగంగా జనసేనకు కేటాయించే చాన్స్‌

6. పత్తిపాడు నియోజకవర్గం
బాలసాని కిరణ్‌కుమార్‌, వైసీపీ అభ్యర్థి
రామాంజనేయులు, రిటైర్డ్‌ ఐఏఎస్‌
వైసీపీలో కొత్తగా మాజీ మంత్రి రావెల భార్య శాంతి పేరు పరిశీలన

7. పొన్నూరు నియోజకవర్గం
కిలారి రోశయ్య, వైసీపీ ఎమ్మెల్యే
ధూళిపాల్ల నరేంద్ర, మాజీ ఎమ్మెల్యే

8. బాపట్ల నియోజకవర్గం
కోనా రఘుపతి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే
నరేంద్ర వర్మ, టీడీపీ ఇన్‌చార్జి

9. వేమూరు నియోజకవర్గం
వరికూటి అశోక్‌బాబు, వైసీపీ ఇన్‌చార్జి
నక్కా ఆనందబాబు, టీడీపీ

10. రేపల్లె నియోజకవర్గం
ఈవూరు గణేశ్‌, వైసీపీ అభ్యర్థి
అనగాని సత్యప్రసాద్, సిట్టింగ్‌ ఎమ్మెల్యే

11. నరసారావుపేట నియోజకవర్గం
గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే
చదలవాడ అరవిందబాబు, టీడీపీ ఇన్‌చార్జి
నల్లపాటి రాము, టీడీపీ ఆశావహుడు

12. సత్తెనపల్లి నియోజకవర్గం
అంబటి రాంబాబు, మంత్రి
కన్నా లక్ష్మీనారాయణ, టీడీపీ అభ్యర్థి
స్తబ్దుగా ఉన్న టీడీపీ నేతలు వైవీ ఆంజనేయులు, కోడెల శివరామ్

13. పెదకూరపాడు నియోజకవర్గం
నంబూరు శంకరరావు, వైసీపీ
కొమ్మాలపాటి శ్రీధర్, ఆలపాటి రాజా

14. చిలకలూరిపేట నియోజకవర్గం
మల్లెల రాజేశ్‌, వైసీపీ ఇన్‌చార్జి
పత్తిపాటి పుల్లారావు, మాజీ మంత్రి
గ్రూపువార్‌తో వైసీపీలో కలవరం

15. గురజాల నియోజకవర్గం
కాసు మహేశ్‌రెడ్డి, వైసీపీ అభ్యర్థి
యరపతినేని శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే
ఎమ్మెల్సీ జంగా కృష్టమూర్తి రాజీనామాతో వైసీపీపై ఎఫెక్ట్‌

16. మాచర్ల నియోజకవర్గం
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే
జూలకంటి బ్రహ్మారెడ్డి, టీడీపీ ఇన్‌చార్జి

17. వినుకొండ నియోజకవర్గం
బ్రహ్మనాయుడు, ఎమ్మెల్యే
జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే

Read Also: బీజేపీతో బీఆర్ఎస్ పొత్తుపై మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు