నారా ఫ్యామిలీలో చంద్రబాబుని మించిపోయిన మనవడి ఆస్తులు

ఏపీ మాజీ మంత్రి,టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ ఇవాళ(ఫిబ్రవరి-20,2020)మంగళగిరి టీడీపీ ఆఫీస్ లో తమ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు ప్రకటించారు. చంద్రబాబు ఆస్తులు గత ఏడాదితో పోలిస్తే రూ.87 లక్షలు పెరిగాయని లోకేష్ తెలిపారు.
చంద్రబాబు మొత్తం ఆస్తులు రూ.9కోట్లు కాగా అందులో నికర ఆస్తి 3.87 కోట్లు.. అప్పులు రూ.5.13 కోట్లు ఉన్నాయని లోకేష్ తెలిపారు.
నారా భువనేశ్వరి మొత్తం ఆస్తులు రూ.50.62కోట్లు. ఇందులో రూ.36.58కోట్లు నికర ఆస్థి కాగా,అప్పులు రూ.11.04కోట్లు. గతేడాదితో పోలిస్తే నికర ఆస్థి రూ. 8.50కోట్లు పెరిగాయి. .
నారా లోకేష్ ఆస్తులు రూ. 24.70కోట్లు. ఇందులో నికర ఆస్థులు రూ.19కోట్లు కాగా అప్పులు రూ.5.70కోట్లు.
నారా బ్రాహ్మణి మొత్తం ఆస్తి 15 కోట్ల 68 లక్షలు. ఇందులో నికర ఆస్థి రూ.11.51కోట్లు కాగా,మొత్తం అప్పులు రూ.4.17కోట్లు. గతేడాదితో పోలిస్తే నారా బ్రహ్మణి నికర ఆస్థిలో రూ.3.80కోట్లు పెరిగాయి. ఇక తన పేరిట ఉన్న షేర్లు బ్రాహ్మణికి బహుమతిగా ఇచ్చినట్లు లోకేష్ తెలిపారు.
ఇక నారా దేవాన్ష్ ఆస్తి 19 కోట్ల 42 లక్షలుగా ఉన్నాయని వివరించారు. గతేడాదితో పోలిస్తే నికర ఆస్థిలో రూ.71లక్షలు పెరిగినట్లు తెలిపారు.
నారా లోకేష్ చెప్పిన దాని ప్రకారం.. చంద్రబాబు కుటుంబం మొత్తం ఆస్తులు రూ.119.42 కోట్లు. అలాగే, మొత్తం అప్పులు కలిపి రూ.26.04 కోట్లుగా ప్రకటించారు. మొత్తంగా చూస్తే ఆస్తుల్లో నుంచి అప్పులు మినహాయించగా, వారి నికర ఆస్తుల విలువ రూ.93.38 కోట్లుగా తెలిపారు. దీనికి నిర్వాణ హోల్డింగ్స్ సంస్థ ఆస్తులు అదనం.
నిర్వాణ హోల్డింగ్స్(చంద్రబాబు కుబుంబ ఇన్వెస్ట్ మెంట్ కంపెనీ)మొత్తం అప్పులు రూ.37.20కోట్లు అప్పులు ఉండేవి. రూ.34.85కోట్లకు తగ్గుదల. నికర ఆస్థులు రూ.9.10కోట్లు. గతేడాదిలో నికర ఆస్థిలో రూ. 2.27కోట్లు పెరిగినట్లు తెలిపారు.
తెలుగుదేశం పార్టీలో యువరక్తం రావాలనే రాజకీయాల్లోకి వచ్చినట్లు నారా లోకేష్ స్పష్టం చేశారు. దేశంలో ఏ పార్టీలో లేని విధంగా4300 మంది కార్యకర్తల కుటుంబాలను ప్రమాద బీమా ద్వారా ఆదుకున్నట్లు తెలిపారు.
Read More>> “నేషనలిజం” పదం పలకవద్దు…కొత్త వివాదానికి తెరదీసిన RSS చీఫ్