Balakrishna : ఢిల్లీలో సీఎం జగన్ తన కేసుల గురించి ఎవరితో ములాకాత్ అయ్యారు..? : బాలకృష్ణ

సంక్షేమ-అభివృద్ధి చేసింది ఎన్టీఆర్, చంద్రబాబు అని...చంద్రబాబు అంటే అభివృద్ధికి ఓ బ్రాండ్ అటువంటి చంద్రబాబు లాంటి వ్యక్తి మీద స్కిల్ కేసులో తప్పుడు ఆరోపణలు చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు.సీఎం జగన్ తీరేంటో ఎవ్వరికీ అర్థం కావడం లేదు..కక్ష సాధింపు తప్ప.. సీఎం జగన్ అభివృద్ధి గురించి పట్టించుకోవడం లేదంటూ విమర్శించారు.

Balakrishna : ఢిల్లీలో సీఎం జగన్ తన కేసుల గురించి ఎవరితో ములాకాత్ అయ్యారు..? : బాలకృష్ణ

Balakrishna

Balakrishna- CM Jagan : అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయ్యాక టీడీపీ నేత, హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతు సీఎం జగన్ పైనా.. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరుపైనా మండిపడ్డారు. రాష్ట్రంలో నియంతృత్వ పరిపాలన జరుగుతోందని మండిపడ్డారు. పబ్లిక్ మీటింగ్, పార్టీ మీటింగ్ అన్నట్టుగా అసెంబ్లీలోనూ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఢిల్లీకి సీఎం వెళ్లి ఎవరితో ములాకాత్.. మిలాకాత్ అవుతున్నారు…? దశాబ్ద కాలంగా జగన్ ఆస్తుల కేసు ప్రస్తావన రాకపోవడానికి ఏ ములాకాత్.. మిలాకాత్ కారణం..? అంటూ ప్రశ్నించారు. స్కిల్ కేసులో ఒక్క రూపాయి కూడా పక్కకు పోలేదని చంద్రబాబును అన్యాయంగా.. అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. అవినీతి జరిగితే దానికి సంబంధించి ఆధారాలు సేకరించి అరెస్ట్ చేస్తారు.. కానీ అరెస్ట్ చేసి ఆధారాలు సేకరిస్తామని సీఐడీ నిస్సిగ్గుగా చెప్పుకుంటోందంటూ ఎద్దేవా చేశారు.

సంక్షేమ-అభివృద్ధి చేసింది ఎన్టీఆర్, చంద్రబాబు అని.. చంద్రబాబు అంటే అభివృద్ధికి ఓ బ్రాండ్ అటువంటి చంద్రబాబు లాంటి వ్యక్తి మీద స్కిల్ కేసులో తప్పుడు ఆరోపణలు చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. సీఎం జగన్ తీరేంటో ఎవ్వరికీ అర్థం కావడం లేదు.. కక్ష సాధింపు తప్ప.. సీఎం జగన్ అభివృద్ధి గురించి పట్టించుకోవడం లేదంటూ విమర్శించారు. ఏ చట్ట ప్రకారం చంద్రబాబు అరెస్ట్ జరిగిందోనని ప్రభుత్వం చెప్పలేని పరిస్థితిలో ఉంది అంటూ ఎద్దేవా చేశారు. అభివృద్ధి – సంక్షేమం చేసిన చంద్రబాబుని అరెస్ట్ చేస్తారా..? అని అందరూ చర్చించుకుంటున్నారని అన్నారు.

Also Read: చంద్రబాబును అరెస్ట్ చేసినచోటే దీక్ష చేస్తాం, అనుమతి ఇవ్వనంటే భయపడినట్లే : భూమా అఖిల ప్రియ

స్కిల్ కేసులో నిజంగానే అవినీతి జరిగి ఉంటే ఛార్జ్ షీట్ ఎందుకు దాఖలు చేయలేదు..? అని ప్రశ్నించారు.స్కిల్ కేసులో షెల్ కంపెనిలే లేవు. జగన్ మైండ్ గేమ్ ఆడుతోందని దీని ద్వారా లబ్ది పొందాలనుకుంటోందని కానీ అది జరగదని అన్నారు.టీడీపీ ఇలాంటివెన్నో చూసింది.. జైల్లో చంద్రబాబు ధైర్యంగానే ఉన్నారు.. కానీ ఆయన ఇప్పటికీ రాష్ట్రం గురించే బాధపడుతున్నారని తెలిపారు. వైజాగుకు జూనియర్ ఆర్టిస్టులను తెచ్చి వైసీపీ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకున్నారంటూ సెటైర్లు వేశారు. ఇవాళ అసెంబ్లీలో చంద్రబాబు కేసును విత్ డ్రా చేసుకోవాలని మేం రిక్వెస్ట్ చేస్తే నియంతృత్వంగా వ్యవహరించారని మండిపడ్డారు.

అక్రమంగా అరెస్ట్ చేసినందుకు చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలని కోరామని…ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అసెంబ్లీలో కోరతే సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. ఓ అబద్దాన్ని వంద సార్లు చెబితే నిజమవుతుందనే భ్రమలో వైసీపీ ఉందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎలాంటి అవకతవకలు జరగలేదు.. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనం కూడా రోడ్ల మీదకు వస్తారని అన్నారు. గంజాయితో యువకుల భవిష్యత్తును నిర్వీర్యం చేస్తున్నారని.. జగన్ తీరు ఎలా ఉందంటే రోమ్ తగులపడితే చక్రవర్తి ఫిడేల్ వాయించేలా ఉంది అంటూ ఎద్దేవా చేశారు.

Also Read : ‘రా చూసుకుందాం’ అంటూ బాలకృష్ణకు మంత్రి అంబటి సవాల్.. తొడకొట్టిన వైసీపీ ఎమ్మెల్యే

మంత్రి అంబటి రాంబాబు సభలో మీసం మేలేసి తొడ కొట్టారు..నా వృత్తిని అవమానించారు.. సినిమాల్లో చూసుకోమన్నారు.. అలాఅంబటి నన్ను రెచ్చగొట్టారని.. రా చూసుకుందామని అంబటి అన్నారు అందుకే తాను రా చూసుకుందామన్నానని అసెంబ్లీలో జరిగిన ఘటనపై వివరించారు.సినిమా ఇండస్ట్రీలో నాలాగా ధైర్యంగా భయపడకుండా మాట్లాడే వారు కొందరే ఉంటారని.. మిగిలిన వారిలాగా నేనూ సైలెంటుగా ఉంటానని అనుకున్నారు.. నేను ముందుకొచ్చేసరికి బిత్తరపోయారని అన్నారు బాలకృష్ణ.

అలాగే సస్పెండ్ కు గురైన టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మాట్లాడుతు.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఓ ఖైదీ డెంగ్యూ వ్యాధితో చనిపోయాడని.. డెంగ్యూ వ్యాధితో ఖైదీ చనిపోవడంతో చంద్రబాబు భద్రత.. ఆరోగ్యంపై మాకూ ఆందోళన ఉందని తెలిపారు.