Nandamuri Balakrishna: పది నిమిషాలైన చంద్రబాబును జైల్లో పెట్టాలనే ఉద్దేశంతోనే అక్రమ కేసులో అరెస్ట్

వనరులు ఎలా ఉత్పత్తి చేయాలో సీఎం జగన్‌కు తెలియదని బాలకృష్ణ అన్నారు. అభివృద్ధి అనేది మన రాష్ట్రంలో ఎక్కడ ఉందని ప్రశ్నించారు. గుంతలు తప్ప అభివృద్ధి శూన్యం.

Nandamuri Balakrishna: పది నిమిషాలైన చంద్రబాబును జైల్లో పెట్టాలనే ఉద్దేశంతోనే అక్రమ కేసులో అరెస్ట్

Nandamuri Balakrishna

Updated On : September 9, 2023 / 9:15 PM IST

Chandrababu Naidu Arrest: చంద్రబాబు నాయుడును ఎలాగైనా జైల్లో పెట్టాలన్న ఉద్దేశంతో ఆయన పేరును చేర్చి ఇరికించాలని చూస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ అన్నారు. సిట్ కార్యాలయంలో ఉన్న చంద్రబాబును కలిసేందుకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బాలకృష్ణ, నారా బ్రాహ్మణి గన్నవరం చేరుకున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. జగన్ 16 నెలలు జైల్లో ఉండటం వలన కక్ష సాధింపు చర్యలతో చంద్రబాబు నాయుడుని పది నిమిషాలు అయినా సరే జైల్లో పెట్టాలని ఉద్దేశంతో అక్రమ కేసులో పెట్టి అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Pathuri Nagabhushanam : చంద్రబాబును అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు : పాతూరి నాగభూషణం

ఎప్పుడో జరిగిన విషయంపై అప్పుడే ముద్దాయిని అరెస్ట్ చేశారు. అది కోర్టులో ఉంది. చంద్రబాబు నాయుడును ఎలాగైనా జైల్లో పెట్టాలన్న ఉద్దేశంతో ఆయన పేరు చేర్చి ఇరికించాలని చూస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ సంస్థలు ఏర్పాటుచేసి చాలామంది నిరుద్యోగ యువతకు శిక్షణను కల్పించారని బాలకృష్ణ అన్నారు. మూడు రాజధానులని మూడు సంవత్సరాలు కాలయాపన చేశారు. నవరత్నాలు పేరిట 80వేల కోట్లు అప్పులు చేశాడు. ఎవరు తీరుస్తారు ఆ బకాయిలు అని బాలకృష్ణ ప్రశ్నించారు.

Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌కు పోలీసుల నుంచి మెయిల్.. విజయవాడ పర్యటన రద్దు.. నాదెండ్ల మనోహర్ ఆగ్రహం

వనరులు ఎలా ఉత్పత్తి చేయాలో సీఎం జగన్‌కు తెలియదని బాలకృష్ణ అన్నారు. అభివృద్ధి అనేది మన రాష్ట్రంలో ఎక్కడ ఉందని ప్రశ్నించారు. గుంతలు తప్ప అభివృద్ధి శూన్యం. ఒక్క రోడ్డైనా ఎప్పుడైనా వేసిన దాఖలాలు లేవుని బాలకృష్ణ అన్నారు. నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై పార్టీయే కాదు, ప్రజలు కూడా ఉద్యమిస్తారని పేర్కొన్నారు.