Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌కు పోలీసుల నుంచి మెయిల్.. విజయవాడ పర్యటన రద్దు.. నాదెండ్ల మనోహర్ ఆగ్రహం

విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టులోనికి ఎవరూ రాకుండా ఆంక్షలెందుకు అంటూ ప్రశ్నించారు. పోలీసులు వ్యక్తులకు సపోర్ట్ చేయవద్దని, లా అండ్ ఆర్డర్ కోసం నిలబడాలని నాదెండ్ల మనోహర్ కోరారు

Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌కు పోలీసుల నుంచి మెయిల్.. విజయవాడ పర్యటన రద్దు.. నాదెండ్ల మనోహర్ ఆగ్రహం

Pawan Kalyan

Updated On : September 9, 2023 / 7:11 PM IST

Chandrababu Arrest: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో ఆయన్ను కలుసుకొనేందుకు విజయవాడకు రావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావించారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకోవాలని భావించినప్పటికీ చివరి నిమిషంలో తన నిర్ణయాన్ని పవన్ విరమించుకున్నారు. గన్నవరం విమానాశ్రయం‌లో పవన్ కళ్యాణ్ దిగేందుకు అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీనికితోడు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న పవన్‌ను విమానాశ్రయంలో అడ్డుకోవటంతో తిరిగి బేగంపేట్ నుండి పవన్ కళ్యాణ్ వెళ్లిపోయారు. మరోవైపు శాంతిభద్రతల సమస్య ఉందని పోలీసులు మెయిల్ పంపడంతో పవన్ విజయవాడ పర్యటనను రద్దు చేసుకున్నారు.

Chandrababu Arrest: చంద్రబాబు తరపున వాదించనున్న సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ లూథ్రా.. అమరావతి, వివేకా హత్యకేసులో..

ఇదిలాఉంటే.. పవన్ కళ్యాణ్ వస్తున్నారని సమాచారంతో గన్నవరం విమానాశ్రయం వద్దకు వెళ్లిన జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ను పోలీసులు అడ్డుకున్నారు. నాదెండ్లను వినాశ్రయంలోకి వెళ్లేందుకు అనుమతించలేదు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం తీరుపై, పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తుందని అన్నారు. ప్రస్తుతం అది పరాకాష్టకు చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు గన్నవరం వస్తుంటే అనుమతి ఇవ్వకపోవడం దుర్మార్గం అన్నారు.

Nara Bhuvaneswari : చంద్రబాబు అరెస్ట్‌పై నారా భువనేశ్వరి

విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టులోనికి ఎవరూ రాకుండా ఆంక్షలెందుకు అంటూ ప్రశ్నించారు. పోలీసులు వ్యక్తులకు సపోర్ట్ చేయవద్దని, లా అండ్ ఆర్డర్ కోసం నిలబడాలని కోరారు. పవన్ ప్రయాణించే విమానాన్ని ఆపేయడం ఎందుకో అర్ధం కావడం లేదన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం మాకెందుకు. పోలీసులు ఎయిర్ పోర్టు అధికారులకు మెయిల్ పంపడం ఆశ్చర్యంగా ఉంది. పవన్ కల్యాణ్ చంద్రబాబును కలిసి సంఘీభావం తెలిపేందుకు వస్తే అడ్డుకోవటం ఏంటి అని ప్రశ్నించారు. ప్రజలంతా వైసీపీ ప్రభుత్వం దుర్మార్గపు తీరుపై ఆలోచించాలని నాదెండ్ల మనోహర్ కోరారు.

పవన్ అంటే ఎందుకింత భయం?: జనసేన

పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానానికి అనుమతి ఇవ్వొద్దంటూ ఏపీ పోలీసులు గన్నవరం ఎయిర్ పోర్టు అధికారులకు లేఖ రాయడంపై జనసేన శ్రేణులు ఫైర్ అయ్యారు. ‘పవన్ కళ్యాణ్ అంటే ఎందుకింత భయం? ఆయన తన పార్టీ కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకోవడమేనా ప్రజాస్వామ్యం?’ అంటూ కృష్ణా జిల్లా SP, గన్నవరం ఎయిర్ పోర్టు అధికారులకు పంపిన లేఖను జనసేన ట్వీట్ చేసింది.