Gorantla Butchaiah: నేను ఒంటరి వాడినయ్యా.. రాజీనామా వార్తలపై బుచ్చయ్య

తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నారంటూ వస్తున్న వార్తలపై ఆ పార్టీ సీనియర్‌ నేత, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు.

Gorantla Butchaiah: నేను ఒంటరి వాడినయ్యా.. రాజీనామా వార్తలపై బుచ్చయ్య

Buchaiah

Updated On : August 19, 2021 / 4:25 PM IST

Gorantla Butchaiah Chowdary: తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నారంటూ వస్తున్న వార్తలపై ఆ పార్టీ సీనియర్‌ నేత, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. ఈ విషయంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా.. నేను ఒంటరి వాడిని అయ్యానంటూ ఉద్వేగభరితంగా మాట్లాడారు. స్థానిక అంశాలేమీ తన అసంతృప్తికి కారణం కాదని, సిద్ధాంత పరమమైన లోపాలపై అసంతృప్తితో ఉన్నట్లు చెప్పుకొచ్చారు.

అనుబంధ కమిటీలు, స్థానిక నాయకత్వంపై గత కొద్దిరోజులుగా బుచ్చయ్య చౌదరి అసంతృప్తిగా ఉన్నారంటూ.. ఈ క్రమంలోనే రాజీనామా చేస్తారనే ప్రచారం జరగగా.. ఆ పార్టీ ముఖ్య నాయకులు చంద్రబాబు, అచ్చెన్నాయుడు బుచ్చయ్యకు ఫోన్ చేసి మాట్లాడారు. అసంతృప్తి విషయంపై ఆయనతో మాట్లాడారు. స్థానికంగా ఇబ్బందులుంటే చెప్పాలని కోరారు.

అనంతరం మాట్లాడిన బుచ్చయ్య చౌదరి.. ముప్పై తొమ్మిది సవంత్సరాలు టీడీపీతో అనుబంధం ఉంది. ఎన్టీఆర్ టీడీపీ పెట్టిందే ఆత్మగౌరవం కోసం.. నేను తప్ప నా కుటుంబ సభ్యులు ఎవ్వరూ రాజకీయాల్లో లేరు.. నా నిర్ణయాన్ని బహిరంగంగానే త్వరలో తెలియజేస్తాను ఇప్పుడు ఏమి మాట్లాడలేను.. పార్టీ మనుగడ కోసమే నా పోరాటమని అన్నారు.