TDP MLC Nara Lokesh : తెలంగాణలో కొత్త పరిశ్రమలు వస్తున్నాయి.. ఏపీకి వచ్చాయా ? – నారా లోకేష్
ప్రతి నియోజకవర్గాన్ని జిల్లా చేస్తారా ? 175 నియోజకవర్గాలను జిల్లాలు చేయాలని డిమాండ్ చేశారు. అసలు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉందో అర్థం కావడం లేదని...

Ap Tdp
AP Liquor Row : తెలంగాణ రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు వస్తున్నాయని.. గత మూడు సంవత్సరాల్లో ఏపీకి ఒక్క పరిశ్రమ తీసుకొచ్చారా ? సూటిగా ప్రశ్నించారు టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్. పరిశ్రమలు, కొత్త ఉద్యోగులు ఇవ్వలేక.. ప్రజల దృష్టి మరల్చడానికి కొత్త కొత్త అంశాలు తెర మీదకు తీసుకొస్తున్నారని మండిపడ్డారు. అందులో భాగమే కొత్త ఏర్పాటు అని తెలిపారు. 2022, మార్చి 24వ తేదీ గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. గత కొన్ని రోజులుగా వైసీపీ, టీడీపీ మధ్య తీవ్ర విమర్శలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే.
Read More : TDP MLCs : ఏపీ శాసనమండలిలో చిడతలు వాయిస్తూ, విజిల్స్ వేసిన టీడీపీ ఎమ్మెల్సీలు
అసెంబ్లీ సాక్షిగా టీడీపీ సభ్యలు ఆందోళన చేయడం..వారిని స్పీకర్ సస్పెండ్ చేయడం పరిపాటైపోయింది. ప్రధానంగా మద్యం, కల్తీసారా వల్ల చనిపోయిన అంశాలను వారు లేవనెత్తుతున్నారు. 2022, మార్చి 24వ తేదీ గురువారం శాసనమండలిలో టీడీపీ సభ్యులు వినూత్నంగా నిరసన తెలిపారు. దీంతో ఏడుగురు టీడీపీ ఎమ్మెల్సీలను ఒక్క రోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు మండలి ఛైర్మన్ వెల్లడించారు. అనంతరం ఎమ్మెల్సీ నారా లోకేష్ మాట్లాడుతూ…ప్రతి నియోజకవర్గాన్ని జిల్లా చేస్తారా ? 175 నియోజకవర్గాలను జిల్లాలు చేయాలని డిమాండ్ చేశారు. అసలు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉందో అర్థం కావడం లేదని, వీటి ఏర్పాటు చేయడం వల్ల ఒక్క ఉద్యోగం వస్తుందా ? అని మరోసారి ప్రశ్నించారు. రాష్ట్ర విభజన అంశాన్ని మరోసారి ప్రస్తావించారాయన.
Read More : Atchannaidu Challenge : రాజకీయాల నుంచి తప్పుకుంటా- అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు
రాష్ట్ర విభజన పార్లమెంట్ చట్టం ద్వారా జరిగిందని..పార్లమెంట్ చట్టాలకు విరుద్ధంగా వ్యవహరించలేమన్నారు. మూడు రాజధానులు కావాలంటే రాష్ట్ర విభజన చట్టాన్ని పార్లమెంట్ సవరణ చేయాలని కోర్టు చెప్పినా.. వీళ్ళకి అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. ఈ అంశంలో మాత్రమే శాసనసభలకు అధికారం లేదని చెప్పినట్లు, పరిపాలన ఒకే చోట ఉండి.. అభివృద్ధి వికేంద్రీకరణ కావాలనేది చంద్రబాబు ఆకాంక్ష అన్నారు. తొంభై శాతం మంది పది ఫెయిల్ బ్యాచ్ ఉన్నారు..వీళ్ళకి అవగాహన ఏమి ఉంటుందని సెటైర్ వేశారు ఎమ్మెల్సీ నారా లోకేష్. మద్యం విషయంలో సీఎం జగన్ చేసిన కామెంట్స్ కు ఆయన కౌంటర్ ఇచ్చారు. బూమ్ బూమ్, అన్న క్యాంటీన్, చంద్రన్న బీమా లాంటివి చంద్రబాబు పథకాలు వంద ఉన్నట్లు, ఇవన్నీ చంద్రబాబు బ్రాండ్స్ అన్నారు. అందుకే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూసివేసి.. 60 శాతం బ్రాండ్స్ తెచ్చారన్నారు. 140 కొత్త బ్రాండ్స్ తీసుకొచ్చిందని, వైసీపీ బ్రాండ్స్ కనుకే అవి మూయలేదు.. ఇది చాలా స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు ఎమ్మెల్సీ నారా లోకేష్.
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మీడియా సమావేశం https://t.co/OG4FVRClsX
— Telugu Desam Party (@JaiTDP) March 24, 2022