Atchannaidu Challenge : రాజకీయాల నుంచి తప్పుకుంటా- అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు

అలా చెప్పలేదు అని జగన్ అంటే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు.(Atchannaidu Challenge)

Atchannaidu Challenge : రాజకీయాల నుంచి తప్పుకుంటా- అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు

Atchannaidu Challenge

Atchannaidu Challenge : వైసీపీ అధికారంలోకి వస్తే మద్యపానంపై నిషేధం విధిస్తామని జగన్ చెప్పలేదా అని ప్రశ్నించారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. అధికారంలోకి వచ్చాక ఎందుకు చేయలేదని నిలదీశారు. మద్య నిషేధం చేస్తానని జగన్ చెప్పలేదు అంటే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.

నాకు ఓట్లు వేయండి. నేను ముఖ్యమంత్రి అయిన తెల్లవారే మద్యపానం నిషేధం దశలవారిగా చేస్తానని చెప్పిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి వైసీపీ పార్టా? నేనా? అడిగిన సమాధానం చెప్పాలి. నిషేధం విధిస్తానని చెప్పావా? లేదా? అలా చెప్పలేదని జగన్ చెబితే నేను రాజకీయాలు మానేస్తాం.(Atchannaidu Challenge)

”రాష్ట్రంలో మద్యం పాలసీని ఎందుకు మార్చారు. జంగారెడ్డిగూడెంలో నాటుసారా తాగి 27 మంది చనిపోయారని వారి కుటుంబసభ్యులే చెప్పారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఎంను కోరామని వారు తెలిపారు. నాటుసారా అంశంపై అసెంబ్లీలో చర్చించాలని అడిగామన్నారు. నాటుసారా మరణాలను సహజ మరణాలుగా సభలో సీఎం చెప్పారు. ఇవన్నీ అడిగినందుకే టీడీపీ సభ్యులను సస్పెండ్‌ చేశారు. అసెంబ్లీలో వైసీపీ సభ్యులు నోటితో భజన చేస్తున్నారు. అసెంబ్లీలో తమకు మైక్‌ ఇవ్వనందునే బయటకు వచ్చాము” అని అచ్చెన్నాయుడు తెలిపారు.(Atchannaidu Challenge)

Illicit Liquor Deaths : అవన్నీ బాబు బ్రాండ్లే! అవే అమ్ముతున్నాం

గతంలో నచ్చిన బ్రాండ్‌ కొనుక్కునే స్వేచ్ఛ ఉండేదని, కానీ నేడు రేటు చెప్పి మద్యం అడగాల్సిన దుస్థితికి తెచ్చారని అచ్చెన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత బ్రాండ్లు చంద్రబాబు తెచ్చినవే అని చెప్పడం దారుణం అన్నారు. టీడీపీ హయాంలో మద్యం బ్రాండ్ల గురించి ఎవరైనా ప్రశ్నించారా అని ఆయన నిలదీశారు. మద్యం పాలసీ మార్చి.. దుకాణాలు తీసుకోవడం వల్లే ఈ సమస్య వచ్చిందన్నారు. ప్రతి మద్యం దుకాణంలో 10 సీసాలు తీసుకుని తనిఖీలు చేయిద్దామని, మద్యంలో ఎంత హానికర రసాయనాలు ఉన్నాయో తెలుస్తుందని ఆయన సవాల్ విసిరారు. మద్యం కొనుక్కోలేకే నాటుసారా తాగారని, ఈ విషయం అందరికీ తెలుసని అచ్చెన్న అన్నారు. మరణాలపై జ్యుడీషియల్‌ విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

మద్యం పాలసీ ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. మద్యం పాలసీ వ్యవహారంలో ఒకరిపై మరొకరు చాలెంజ్ లు విసుకున్నారు. అసెంబ్లీలో మద్యం పాలసీపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు హయాంలోనే 254 బ్రాండ్లకు అనుమతిని ఇచ్చారని జగన్ చెప్పారు. ఈ బ్రాండ్లన్నీ చంద్రన్న కానుకలే అని అన్నారు. 2019 తర్వాత ఏపీలో కొత్తగా ఒక్క మద్యం బ్రాండ్ కు కూడా అనుమతిని ఇవ్వలేదని వెల్లడించారు.

AP Illicit Liquor Deaths : టీడీపీ నిరసన ప్రదర్శన.. జగన్ ఫొటోకి మద్యంతో అభిషేకం

స్పెషల్ స్టేటస్, త్రీ క్యాపిటల్స్ వంటి బ్రాండ్లు ఉన్నట్టు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 16 కొత్త జిల్లాలు, మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇచ్చామని, చంద్రబాబు మాత్రం 14 డిస్టిలరీలకు అనుమతి ఇచ్చారని అన్నారు. అందుకే ఆయన ఇంటి పేరును ‘నారా’ బదులు ‘సారా’ అని పెట్టుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు.