Ram Mohan Naidu : మీరు రాజీనామా చేస్తే మేమూ రెడీ.. వైసీపీ ఎంపీలకు టీడీపీ సవాల్
రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ హామీతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు చిత్తశుద్ధి ఉంటే ఆ పార్టీకి చెందిన చెందిన 28 మంది ఎంపీలు రాజీనామా చేసి కేంద్రంపై ఒత్తిడి తేవాలి.

Rammohan Naidu
Ram Mohan Naidu : ప్రత్యేక హోదా అంశం ఏపీలో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. విభజన సమస్యల పరిష్కారం కోసం కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ అజెండాలో తొలుత ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చిన కేంద్ర హోంశాఖ.. ఆ తర్వాత అజెండా నుంచి తొలగించడం దుమారం రేపుతోంది. ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య చిచ్చు రాజేసింది. అజెండా నుంచి స్పెషల్ స్టేటస్ అంశాన్ని తొలగించడం వెనుక టీడీపీ, బీజేపీ నేతల హస్తం ఉందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
చంద్రబాబుని టార్గెట్ చేస్తూ అధికార పార్టీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. బీజేపీలో ఉన్న తన మనుషులతో చెప్పించి ప్రత్యేక హోదా అంశాన్ని అజెండా నుంచి తొలగించారని చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ నేతలు. టీడీపీని ఉద్దేశించి అధికార పార్టీ నేతలు చేస్తున్న విమర్శలకు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కౌంటర్ ఇచ్చారు. వైసీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Coriander Water : వ్యాధుల నుండి రక్షణ కల్పించే ధనియాల కషాయం
”రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ హామీతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు చిత్తశుద్ధి ఉంటే ఆ పార్టీకి చెందిన చెందిన 28 మంది ఎంపీలు రాజీనామా చేసి కేంద్రంపై ఒత్తిడి తేవాలి. వాళ్లు రాజీనామాలు చేసిన మరుక్షణమే మేం కూడా పదవులకు రాజీనామా చేస్తామని” రామ్మోహన్ నాయుడు ప్రకటించారు.
Vivo New Smartphone: వివో నుంచి T1 5G స్మార్ట్ ఫోన్, ధర, ఫోన్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి?
”సబ్ కమిటీలో స్పెషల్ స్టేటస్ అంశాన్ని అజెండాలో పెడితే డప్పు కొట్టి చెప్పారు… ఐదు అంశాలను తొలగిస్తే కేంద్రాన్ని ప్రశ్నించరా..? సీఎం జగన్ వైఫల్యం, చేతగాని తనమే దీనికి కారణం. తమిళనాడు సీఎం స్టాలిన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తెలంగాణ సీఎం కేసీఆర్.. కేంద్రానికి భయపడటం లేదు… కానీ, ఏపీ సీఎం జగన్ కేంద్రాన్ని గొంతెత్తి ఎందుకు అడగటం లేదు? 151 మంది మినహా జగన్‌ను ఎవరూ పొగిడే పరిస్థితి లేదు. సినిమా వాళ్లను పిలిపించుకుని పొగిడించుకుంటున్నారు. తుగ్లక్ లానే కాకుండా పులకేసిలా జగన్ పొగిడించుకుంటున్నారు” అని ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శలు చేశారు.
కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ అజెండా నుంచి ప్రత్యేకహోదా అంశాన్ని తొలగించడం వెనుక తన హస్తం ఉందంటూ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కూడా తీవ్రంగా ఖండించారు. టీడీపీ అధినేత చంద్రబాబు చెబితే తాము అలా చేశామనే వైసీపీ నేతల ప్రచారంలో నిజం లేదన్నారు. చంద్రబాబు చెబితే మేము మారుస్తామా? అని ప్రశ్నించారు.
వైసీపీ నేతలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏవైనా నిర్ణయాలు చేస్తే వాటిని తాము మార్చగలమా? అని ప్రశ్నించారు. వైసీపీ చేస్తున్న రాజకీయాలను ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. వైసీపీది ఆర్భాటమే తప్ప.. చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. బీజేపీపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
ఏపీకి ప్రత్యేక హోదాపై మరోసారి క్లారిటీ ఇచ్చారు ఎంపీ జీవీఎల్. ప్రత్యేక హోదా ఇప్పుడు లేదు. దీన్ని అందరూ అర్ధం చేసుకోవాలి. ఏపీ రెవెన్యూ గ్యాప్, స్పెషల్ స్టేటస్ వంటి అంశాలు వివాద పరిష్కార కమిటీలో ఉంచే అంశం పై బుగ్గన స్పందించాలి. బుగ్గన ఉండాలని చెబితే నా లేఖను మార్చుకుంటా. జూనియర్ స్థాయి అధికారులు పొరపాటు చేశారు. దాన్ని రాజకీయం చేస్తే ఎలా? అని జీవీఎల్ ప్రశ్నించారు.