మళ్లీ అధికారంలోకి టీడీపీ : చంద్రబాబు

ఏపీలో టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చెప్పారు.

  • Published By: veegamteam ,Published On : March 28, 2019 / 12:11 PM IST
మళ్లీ అధికారంలోకి టీడీపీ : చంద్రబాబు

Updated On : March 28, 2019 / 12:11 PM IST

ఏపీలో టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చెప్పారు.

ఏపీలో టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చెప్పారు. నూటికి నూరు శాతం టీడీపీ గెలుస్తుందన్నారు. మళ్లీ మనమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. టీడీపీ గెలుపు చారిత్రక అవసరమన్నారు. మైలవరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగించారు. అన్నదాత సుఖీభవతో రైతులకు పెట్టుబడి అందిస్తున్నామని చెప్పారు.

పెన్షన్ రూ. 2 వేలకు పెంచామని భవిష్యత్ లో దాన్ని రూ. 3 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. పసుపు-కుంకుమ పథకం కింద మహిళలకు రూ.20 వేల ఆర్థిక సాయం చేశానని చెప్పుకొచ్చారు. యువతకు జాబు రావాలంటే బాబు ఉండాలన్నారు. ‘మీ భవిష్యత్..నా బాధ్యత’ అని అన్నారు. రాష్ట్ర విభజన వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.