Liquor Ban: ‘కల్తీ సారా అరికట్టాలి’ ఆంధ్రలో రెండ్రోజుల పాటు టీడీపీ నిరసనలు

ఆంధ్రప్రదేశ్‌లో జే బ్రాండ్స్ మద్యం నిషేదించాలి అంటూ కల్తీ సారా అరికట్టాలి అంటూ రెండ్రోజుల పాటు నిరసన వ్యక్తం చేయనున్నట్లు టీడీపీ వెల్లడించింది. మద్యం అమ్మకాల వైసీపీ ప్రభుత్వాన్ని..

Liquor Ban: ‘కల్తీ సారా అరికట్టాలి’ ఆంధ్రలో రెండ్రోజుల పాటు టీడీపీ నిరసనలు

Chandrababu

Updated On : March 18, 2022 / 4:34 PM IST

Liquor Ban: ఆంధ్రప్రదేశ్‌లో జే బ్రాండ్స్ మద్యం నిషేదించాలి అంటూ కల్తీ సారా అరికట్టాలి అంటూ రెండ్రోజుల పాటు నిరసన వ్యక్తం చేయనున్నట్లు టీడీపీ వెల్లడించింది. మద్యం అమ్మకాల వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీయాలంటూ గ్రామ స్థాయి నేతలు, పార్టీ క్యాడర్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలిచ్చారు.

దేశంలో లేని మద్యం బ్రాండ్లు ఏపీలో ఎందుకు అమ్ముతున్నారు. అధికారంలోకి వస్తే మద్యపాన నిషేదం అమలుచేస్తానని చెప్పిన సీఎం.. సొంత బ్రాండ్లతో మహిళల తాళిబొట్లు తెంచుతున్నాడు. జగన్ తెచ్చిన కొత్త బ్రాండ్లు స్లో పాయిజన్ గా మారి ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి.

”దేశంలో ఎక్కడా లేని బ్రాండ్లు ఏపీలోనే ఎందుకున్నాయి’ ‘వాటిని తయారు చేస్తుందెవరు’… ‘ఏ ధరకు అమ్ముతున్నారు’ అనే విషయాలపై జగన్ సమాధానం చెప్పాలి”

Read Also : మందుబాబులకు షాక్.. 48 గంటల పాటు మద్యం దుకాణాలు క్లోజ్

‘సొంత బ్రాండ్ల ద్వారా ఏడాదికి నుంచి 5 వేల కోట్లు దోచేస్తున్నారు. 5 ఏళ్లలో ఒక్క మద్యం ద్వారానే కమిషన్ల రూపంలో 25-30 వేల కోట్లు కాజేశాడు’

‘జగన్ ది అసత్యాల ప్రయాణం. ఇప్పుడు అన్నీ బయట పడుతున్నాయి. ఒకే సామాజికవర్గానికి చెందిన 37 మందికి డీస్పీలుగా ప్రమోషన్ అనేది జగన్ చేసిన తప్పుడు ప్రచారం అని తేలిపోయింది’ అంటూ విమర్శలు గుప్పించారు చంద్రబాబు.