టీడీపీ గెలవడం చారిత్రక అవసరం : చంద్రబాబు
ఏపీలో టీడీపీ గెలవడం చారిత్రక అవసరమని చంద్రబాబు అన్నారు.

ఏపీలో టీడీపీ గెలవడం చారిత్రక అవసరమని చంద్రబాబు అన్నారు.
ఏపీలో టీడీపీ గెలవడం చారిత్రక అవసరమని చంద్రబాబు అన్నారు. నదుల అనుసంధానంతో కరువును పారదోలుతున్నామని చంద్రబాబు అన్నారు. గుడివాడలో తాగునీటి కష్టాలు తీర్చామని తెలిపారు. పసుపు-కుంకుమ కింద మహిళలకు పదివేల రూపాయలు ఇస్తున్నామని చెప్పారు. దేవుడు కనికరిస్తే ఎక్కువ కూడా ఇస్తామన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. తాను కష్టపడేది పేదవారి కోసమేనని తెలిపారు. గుడివాడలో టీడీపీ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగించారు.
టీడీపీ ప్రభుత్వంలో ప్రజలు ఆనందంగా ఉన్నారని సంతోషం వ్యక్తం చేశారు. పేదవారికి సొంతింటి కల నెరవేర్చే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. పట్టిసీమ వద్దని వైసీపీ అడ్డంపడిందన్నారు. కేంద్ర ప్రభుత్వం మనల్ని చాలా ఇబ్బందులు పెడుతోందని మండిపడ్డారు. ఎన్ని కష్టాలు వచ్చినా జెండాలు మోసిన కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. పేదరికం లేని సమాజం కావాలని ఆకాంక్షించారు. పింఛన్ రూ.2 వేలకు పెంచి పేదలకు భరోసా ఇచ్చామన్నారు.