Gold Man Vijay Kumar : వామ్మో.. ఆయన ఒంటిపై 5 కిలోల బంగారం.. తిరుమలలో సందడి చేసిన తెలంగాణ గోల్డ్ మ్యాన్..
రెండు చేతుల్లో పది వేళ్లకు పది ఉంగరాలు, రెండు చేతులకు భారీ కంకణాలు, బంగారు వాచ్ లు, మెడలో భారీ స్వర్ణాభరణాలు ధరించి తిరుమలకు వచ్చారు.

Gold Man Vijay Kumar : తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఓ వ్యక్తి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. కొండపై భక్తులందరూ ఆయనవైపు చూసి ఆశ్చర్యపోయారు. ఆయన మరెవరో కాదు.. తెలంగాణ గోల్డ్ మ్యాన్ గా గుర్తింపు పొందిన హోప్ ఫౌండేషన్ అధినేత విజయ్ కుమార్. న్యూ ఇయర్ సందర్భంగా ఒంటిపై 5 కేజీల బంగారం వేసుకుని శ్రీవారిని దర్శించుకున్నారు విజయ్ కుమార్.
ఉంగరాలు, కంకణాలు, భారీ స్వర్ణాభరణాలు..
రెండు చేతుల్లో పది వేళ్లకు పది ఉంగరాలు, రెండు చేతులకు భారీ కంకణాలు, బంగారు వాచ్ లు, మెడలో భారీ స్వర్ణాభరణాలు ధరించి తిరుమలకు వచ్చారు. విజయ్ కుమార్ తో సెల్ఫీలు దిగేందుకు భక్తులు పోటీలు పడ్డారు. మూడేళ్లుగా కుటుంబసభ్యులు, హోప్ ఫౌండేషన్ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకుంటున్నట్లు విజయ్ కుమార్ తెలిపారు. గతంలోనూ విజయ్ కుమార్ దాదాపు 10 కిలోల బంగారు ఆభరణాలు ధరించి శ్రీవారిని దర్శించుకున్నారు.
Also Read : కొత్త సంవత్సరం తొలి రోజునే గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర..
తనకు గోల్డ్ పై ఉన్న ఆసక్తితోనే భారీ ఆభరణాలు చేయించుకున్నానని విజయ్ కుమార్ తెలిపారు. కొండా విజయ్ కుమార్ తెలంగాణ ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి కూడా.
గోల్డ్ మ్యాన్ ను ఆసక్తిగా చూసిన భక్తులు..
ఒంటి నిండా బంగారంతో తిరుమలకు వచ్చిన విజయ్ కుమార్ ను చూసి భక్తులు ఆశ్చర్యపోయారు. సాధారణంగా ఒంటి మీద ఒకటో రెండో గోల్డ్ చైన్లు ఉంటేనే భయం భయంగా ఉంటుంది. అలాంటిది ఏకంగా 5 కిలోల బంగారం ధరించడం అంటే మామూలు విషయం కాదంటున్నారు భక్తులు. అసలే గోల్డ్ రేట్ చుక్కలను తాకుతోంది. తులం పసిడి కొనాలన్నా ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంది. అలాంటిది విజయ్ కుమార్ ఏకంగా తన ఒంటిపై 5 కిలోల గోల్డ్ ధరించడం సంభ్రమాశ్చర్యానికి గురి చేసిందంటున్నారు భక్తులు.
Also Read : కొత్త ఏడాదిలో తొలిరోజు పెరిగిన బంగారం ధరలు.. వివరాలు ఇక్కడ తెలుసుకోండి..