తెలుగు పద్మాలు : నలుగురికి పద్మ పురస్కాలు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన పద్మ అవార్డులను ప్రకటించింది. 70వ రిపబ్లిడేను పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశేష ప్రతిభ చూపిన ప్రముఖులను పద్మ పురస్కారాలకు ఎంపిక

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన పద్మ అవార్డులను ప్రకటించింది. 70వ రిపబ్లిడేను పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశేష ప్రతిభ చూపిన ప్రముఖులను పద్మ పురస్కారాలకు ఎంపిక
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన పద్మ అవార్డులను ప్రకటించింది. 70వ రిపబ్లిడేను పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశేష ప్రతిభ చూపిన ప్రముఖులను పద్మ పురస్కారాలకు ఎంపిక చేసింది. ఈ ఏడాది నలుగురికి పద్మ విభూషన్, 14 మందికి పద్మ భూషణ్, 94 మందికి పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. కేంద్రం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో నలుగురు తెలుగు వారు ఉన్నారు.
తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఏడాది నలుగురు వ్యక్తులను పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేశారు. ప్రముఖ సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రిని పద్మశ్రీ పురస్కారం వరించింది. ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రీ, చెస్ క్రీడాకారిణి హారికా ద్రోణవల్లి, వ్యవసాయవేత్త, రైతు నేస్తం వ్యవస్థాపకులు వెంకటేశ్వర రావు యడ్లపల్లికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. సిరివెన్నెల, సునీల్ ఛెత్రీకి తెలంగాణ నుంచి అవార్డులు దక్కగా.. హారిక, వెంకటేశ్వర రావుకు ఏపీ నుంచి పురస్కారాలకు ఎంపికయ్యారు.
పద్మశ్రీ అవార్డులు పొందిన తెలుగువారిని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభినందించారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి వందల పాటలను రాసిన గేయ రచయిత. ద్రోణవల్లి హారిక చిన్న వయసులోనే చెస్ క్రీడలో జాతీయ – అంతర్జాతీయ పోటీల్లో విశేష ప్రతిభ కనపరిచి..ఎన్నో పతకాలను తీసుకొచ్చారు. యడ్లపల్లి వెంకటేశ్వరరావు వ్యవసాయం రంగంలో విశేష కృషి చేశారు.