happy christmas : తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల విందు

క్రిస్మస్‌ను వచ్చేస్తోంది. పండుగను పురస్కరించుకొని తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు విందు ఇవ్వనున్నాయి. హైదరాబాద్ LB స్టేడియంలో ఈ కార్యక్రమం జరుగనుంది. ప్రభుత్వం ఐదేళ్లుగా క్రిస్మస్ విందును నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. విందు విజయవంతానికి 14 శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. స్టేడియంలో నిర్వహించనున్న క్రిస్మస్ విందుకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఆయన క్రిస్టియన్లకు క్రిస్మస్ ఫీస్ట్, దుస్తులు, బహుమతులు అందజేయనున్నారు. అనంతరం జరిగే విందులో పాల్గొంటారు. క్రిస్మస్ విందుకోసం ఇప్పటికే ఎల్‌బీ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి.
మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా క్రిస్మస్ విందు ఇవ్వనుంది. క్రిస్మస్ సందర్భంగా క్రిస్టియన్లకు ప్రభుత్వం విందును ఏర్పాటు చేసింది. విజయవాడలోని A కన్వెన్షన్ సెంటర్‌లో ఈ వేడుక జరగనుంది. క్రైస్తవ మత పెద్దలందరికీ ఈ విందుకు ఆహ్వానం అందించారు. సాయంత్రం ఐదున్నరకు జరిగే ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొంటారు. పలువురు క్రిస్టియన్లను సత్కరించనున్నారు.
మరోవైపు ఇప్పటికే క్రిస్మస్ సందడి నెలకొంది. రకరకాల వస్తువులు మార్కెట్‌ని ముంచెత్తాయి. అలంకరణ సామాగ్రీ కొనుగోలు చేసేందుకు వస్తున్న వారితో మార్కెట్లు కళకళలాడుతున్నాయి. గృహాలంకరణ సామాగ్రీతో పాటు క్రీస్తు జన్మదిన వృత్తాంతాన్ని సూచించే స్టార్లు, చిన్నా పెద్ద అంతా ఇష్టపడే..శాంతాక్లాజ్ తాతయ్యలు తదితర బొమ్మల విక్రయాలతో సందడి మొదలైంది. క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ సోదరులు ఇళ్లను అందంగా అలంకరించుకుంటుంటారు. క్రిస్మస్ ట్రీ, క్రీస్తు జననాన్ని సూచించే క్రిస్టల్, స్టోన్ పాలిష్‌తో చేసిన బొమ్మలను షాకేసుల్లో అమర్చుకుంటారు. స్టార్స్‌ని ఇంటి బయట ఏర్పాటు చేస్తారు. రంగురంగుల దీపాలు, గాలి బుడగలు, గంటలు, క్రిస్మస్ చెట్లతోను ఇంటిని డెకరేట్ చేస్తున్నారు.