పోస్టుమార్టం వద్దు : బైక్‌పై మృతదేహంతో పారిపోయేందుకు ప్రయత్నం

నంద్యాల ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మృతదేహానికి పోస్టుమార్టం వద్దంటూ..కుటుంబసభ్యులు హల్ చల్ చేశారు. వైద్యులు, సెక్యూర్టీ సిబ్బంది, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బైక్‌పై డెడ్ బాడీతో వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వీరిని అడ్డుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆత్మహత్య చేసుకున్న వారికి పోస్టుమార్టం నిర్వహించక తప్పదని చెప్పినా..వారు వినిపించుకోలేదు.
వివరాల్లోకి వెళితే..
దోర్నపాడు మండలం, గోవ గిర్లదిన్నె నారాయణ అనే యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనిని కుటుంబసభ్యులు వ్యతిరేకించారు. తమ బిడ్డకు పోస్టుమార్టం వద్దంటూ వాగ్వాదానికి దిగారు. సూసైడ్ చేసుకున్న వారికి పోస్టుమార్టం నిర్వహించాల్సిందే..అంటూ వైద్యులు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.
చివరకు డెడ్ బాడీని స్ట్రెచర్‌పై బయటకు తీసుకొచ్చారు. అక్కడనే విధుల్లో ఉన్న ఔట్ పోస్టు కానిస్టేబుల్ అడ్డుకున్నాడు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. చివరకు బైక్‌పై డెడ్ బాడీతో పారిపోయేందుకు ప్రయత్నించాడు. చివరకు ఎలాగో అందరినీ అదుపులోకి తీసుకుని డెడ్ బాడీని ఆస్పత్రి వైద్యులకు అప్పగించారు. అక్కడ జరుగుతున్న పరిణామంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. అసలు పోస్టుమార్టం ఎందుకు వద్దన్నారో..నారాయణ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియరాలేదు.
Read More : దిశా చట్టం..రాష్ట్రపతి ఆమోదం తర్వాతే – సుచరిత