కినెటా పవర్ ప్రాజెక్టుకు ఇచ్చిన భూములను వెనక్కి తీసుకున్న ఏపీ ప్రభుత్వం

The Ap Government Withdrew The Lands Given To The Kineta Power Project
AP government Kineta Power project : కినెటా పవర్ ప్రాజెక్టుకు ఇచ్చిన భూములను ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకున్నది. నెల్లూరు జిల్లా తమ్మినపట్నం, మోమిడిలో ఆ సంస్థకు ఇచ్చిన 840 ఎకరాల భూమిని వెనక్కు తీసుకోవాలని ఏపీఐఐసీకి ఆదేశాలు జారీ చేసింది. 3 దఫాలుగా నోటీసులు ఇచ్చినా కంపెనీ స్పందించకపోవడంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
గతంలో థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వంతో కినెటా పవర్ ప్రాజెక్టు లిమిటెడ్ తో ఒప్పందం చేసుకున్నది. అందుకుగానూ 1,980 మెగవాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు కోసం ప్రభుత్వం భూమి ఇచ్చింది. ఆ సంస్థ నుంచి స్పందన లేకపోవడంతో ఆ ఆట్టి భూములను వెనక్కి తీసుకుంది.