New Districts: జిల్లాల ఏర్పాటుకు సన్నాహాలు.. అభ్యంతరాలు, సూచనలపై సమీక్షలు
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుకు సన్నాహాలు సాగిస్తోంది ప్రభుత్వం. ఇవాళ(23 ఫిబ్రవరి 2022) నుంచి అభ్యంతరాలు సూచనలపై సమీక్షలు చేయనున్నారు అధికారులు.

Andhra Pradesh
New Districts: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుకు సన్నాహాలు సాగిస్తోంది ప్రభుత్వం. ఇవాళ(23 ఫిబ్రవరి 2022) నుంచి అభ్యంతరాలు సూచనలపై సమీక్షలు చేయనున్నారు అధికారులు. అన్ని జిల్లాల్లో కలిపి 1478 అభ్యంతరాలు, అభిప్రాయాలు స్వీకరించారు అధికారులు. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 700 అభ్యంతరాలు, అతి తక్కువగా శ్రీకాకుళం జిల్లాలో 16 విజ్ఞప్తులు వచ్చినట్లుగా చెబుతున్నారు అధికారులు.
మొత్తం 13 జిల్లాల కలెక్టర్లతో ఈనెల 28వ తేదీ వరకు సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు అధికారులు. తిరుపతి, విజయవాడ, అనంతపురం, విశాఖపట్నం నగరంలో సమావేశాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. విన్నపాలు గురించి ఈ సమావేశంలో సామీక్షించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు.
కృష్ణ ,పశ్చిమ గోదావరి, ప్రకాశం, గుంటూరు జిల్లాల కలెక్టర్లతో 23వ తేదీన విజయవాడలో సమావేశం నిర్వహించనున్నారు. 24వ తేదీన తిరుపతిలో చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లా కలెక్టర్‌తో సమావేశం జరగనుంది. 26వ తేదీన అనంతపురంలో అనంతపురం, కర్నూలు జిల్లా కలెక్టర్‌తో సమావేశం జరగబోతుంది. 28వ తేదీన విశాఖపట్నంలో విశాఖపట్నం, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లా కలెక్టర్‌తో సమావేశం జరగనుంది.