Another Murder : తిరుపతిలో మరో వ్యక్తి హత్య.. అప్పు తీసుకున్న వారే చంపేశారు..!
భాకరాపేట అడవుల్లో చంద్రశేఖర్ మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు. ముగ్గురు అనుమానితులు పోలీసుల అదుపులో ఉన్నారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

Murder (1)
Another murder in Tirupati : తిరుపతిలో గత రాత్రి జరిగిన యువకుడి హత్య మరవకముందే మరో వ్యక్తి హత్య గావించబడటం తీవ్ర కలకలం రేపుతోంది. ఏపీ టూరిజం కార్పొరేషన్ లో సూపర్ వైజర్ గా పని చేస్తున్న చంద్రశేఖర్ హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. గత నెల 31 నుంచి చంద్రశేఖర్ కనిపించడం లేదంటూ పోలీసులకు కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు యూనివర్శిటీ పీఎస్ లో మిస్సింగ్ కేసు నమోదు అయింది.
కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ముగ్గురు వ్యక్తులు చంద్రశేఖర్ ను హత్య చేసినట్లు గుర్తించారు. చంద్రశేఖర్ వద్ద అప్పు తీసుకున్న వారే హత్యకు పాల్పడినట్లు నిర్దారణ అయింది. తిరుపతిలో హత్య చేసి భాకరాపేట అడవుల్లో మృతదేహాన్ని పడేసినట్లు గుర్తించారు.
Youngster Murder : పుట్టిన రోజు నాడే యువకుడి దారుణ హత్య.. స్నేహితులే చంపేశారు
భాకరాపేట అడవుల్లో చంద్రశేఖర్ మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు. ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
కాగా, గత రాత్రి తిరుపతిలో ఓ యువకుడు దారుణ హత్య గావించబడిన సంగతి తెలిసిందే. స్నేహితులే అతన్ని హతమార్చారు. గత రాత్రి ఓ హోటల్ వద్ద ప్రసన్న కుమార్ అనే యువకుడిని అతని స్నేహితులు బీరు బాటిళ్లతో పొడిచి చంపేశారు. పుట్టిన రోజు నాడే ప్రసన్న కుమార్ ను హతమర్చారు.