తిరుపతి కార్పొరేషన్ ఏడో డివిజన్ ఎన్నిక నిలిపివేత

AP SEC sensational decision : ఏపీ ఎస్ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుపతి కార్పొరేషన్‌లో ఏడో డివిజన్ ఎన్నికలు నిలిపేస్తూ ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంది. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి నామినేషన్‌ను ఉపసంహరించారంటూ ఎస్ఈసీకి కంప్లైంట్ అందింది.
దీనిపై విచారణ జరిపిన ఎస్ఈసీ.. నిజమేనని నిర్ధారించింది. దీంతో ఏడో డివిజన్ ఎన్నికను నిలిపేస్తూ ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంది.
మరోవైపు అభ్యర్థులు ప్రచారంలో బిజీ బిజీగా ఉన్నారు. నరగంలోని ఇంటింటికి తిరిగి ఎన్నికల క్యాంపెయిన్ చేస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంలో నిమగ్నమయ్యాయి.