YCP Rebel MLAs : వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు రంగం సిద్ధం..!
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు రంగం సిద్దమైంది.

The stage is set for the disqualification of YCP rebel MLAs
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు రంగం సిద్దమైంది. ఈ రోజు లేదా రేపు స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. రెబల్ ఎమ్మెల్యేలు ఇచ్చిన స్టేట్‌మెంట్ ప్రస్తుతం స్పీకర్ పరిశీలనలో ఉంది. మరో వైపు హైకోర్టులో రెబల్ ఎమ్మెల్యేలకు చుక్కెదురైంది. దీంతో పార్టీల ఫిరాయింపులు చేసిన ఎమ్మెల్యేలకు అనర్హత వేటు తప్పదని.. ఒకవేళ అనర్హత వేటు పడితే రెబల్స్ రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కును కోల్పోనున్నారు. కాగా.. ఇప్పటికే రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.
సమయం అడిగినా ఇవ్వలేదు
రాజ్యసభ ఎన్నికలో ఓటమి భయంతోనే వైసీపీ తమపై వేటు వేసిందని రెబల్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. నాలుగు వారాలు గడువు అడిగినా ఇవ్వలేదని, అయినా చట్టసభలపై ఉన్న గౌరవంతో విచారణకు వచ్చి వివరణ ఇచ్చామన్నారు. తమపై వైసీపీ చేసిన ఆరోపణలకు ఆధారాలు అడిగినా స్పీకర్, అసెంబ్లీ సెక్రటరీ సమాధానం చెప్పలేదన్నారు.
AP IPS Transfer : ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ.. మొత్తం 30మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు
మొత్తానికి రాజ్యసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రెబల్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనన్న దానిపై సందిగ్ధ వాతావరణం కనిపిస్తోంది. మరో వైపు ఈ నిర్ణయాలు కోర్టుకు చేరినా ఎలాంటి నిర్ణయం వస్తుందనేది సస్పెన్స్‌గా మారింది.