Tirumala : తిరుమలలో రాతి శంఖు,చక్రాలు భద్రం

తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో ఉండే రాతి శంఖు చక్రాలు మాయం అయ్యాయనే వార్తకు తెర పడింది.

Tirumala : తిరుమలలో రాతి శంఖు,చక్రాలు భద్రం

Tirumala

Updated On : June 9, 2021 / 7:23 PM IST

Tirumala : తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో ఉండే రాతి శంఖు చక్రాలు మాయం అయ్యాయనే వార్తకు తెర పడింది. వాటిని టీటీడీ అధికారులు భద్రపరిచారు. శంఖు చక్రాలు మాయం అయ్యాయని ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.

రెండేళ్ల క్రితం ఓ అజ్ఞాత భక్తుడు ఈ మార్గం వద్ద రాతి శంఖు,చక్రాలను ఉంచాడు. అప్పటి నుంచి ఈ మార్గంలో నడిచేభక్తులు వాటికి పసుపు కుంకుమలు అద్ది పూజలు చేస్తూ ఉండేవారు. ఈరోజు ఉదయం అవి మాయం అయ్యాయనే వార్త కలకలం రేపింది.

కాగా కోతుల సందడితో ఇటీవల రాతిశంఖు చక్రం కింద పడి పగిలిపోయాయని… శ్రీవారి నామం అలాగే ఉందని విజిలెన్స్ అధికారులు తెలిపారు. పగిలిన శంఖు,చక్రాన్ని టీటీడీ విజిలెన్స్ అధికారులు భద్రపరిచినట్లు తెలిపారు.